ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా సంస్థలు స్టార్టప్ గుర్తింపు పొందాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. 2,01,335 స్టార్టప్‌లను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం డీపీఐఐటీ గుర్తించినట్లు తెలిపింది. ఇవి దేశవ్యాప్తంగా 21 లక్షల పైచిలుకు ఉద్యోగాలను కల్పాయని పేర్కొంది. 2025 జూన్ వరకు 14 రంగాలవ్యాప్తంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రూ. 1.88 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయని శాఖ వివరించింది. దీనితో అదనంగా రూ. 17 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తి/అమ్మకాలు జరిగాయని, 12.3 లక్షల మేర ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొంది.
పీఎల్‌ఐ స్కీముతో ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెలికం, నెట్‌వర్కింగ్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల నుంచి ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద స్టార్టప్‌గా గుర్తింపు పొందిన సంస్థలకు ఆదాయ పన్ను రాయితీ తదితర ప్రోత్సాహకాలు లభిస్తాయి. మరోవైపు, వ్యాకారాల నిర్వహణను సరళతరం చేసే క్రమంలో నిబంధనల భారాన్ని కూడా గణనీయంగా తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. గత 11 ఆర్థిక సంవత్సరాల్లో (2014–25) భారత్‌లోకి 748.38 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని వివరించింది. అంతక్రితం 11 ఏళ్లలో (2003–14) వచ్చిన 308.38 బిలియన్ డాలర్లకు ఇది 143 శాతం అధికమని పేర్కొంది.


