భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాయి. వీఐ (వోడాఫోన్ ఐడియా), బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమదైన రీతిలో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా Vi యూజర్లలో ప్రతి ఐదు మందిలో ఒకరు కూడా యాక్టివ్‌గా లేరని ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో వెల్లడించింది.
ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో.. పేర్కొన్న విషయాలు, కంపెనీ చెబుతున్న విషయాలు చూస్తుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఎలా అంటే.. Vi చెబుతున్న యూజర్లు 197.2 మిలియన్స్. కానీ నిజంగా యాక్టివ్‌గా ఉన్న యూజర్లు 154.7 మిలియన్స్ మాత్రమే. దీన్నిబట్టి చూస్తే.. కంపెనీ చెబుతున్న రిపోర్ట్ వేరు, వాస్తవంగా నెట్‌వర్క్‌లో ఉన్న యూజర్లు వేరు, అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో కూడా 2జీ నెంబర్ యూజర్లను తీసేస్తే.. 4జీ ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య మరింత తగ్గిపోతుంది.
యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (ఏఆర్‌పీయూ) విషయానికి వస్తే.. కాగితంపై, Q2 FY26లో Vi ఏఆర్‌పీయూ రూ.167. ఇది ఎయిర్‌టెల్ (రూ. 256), జియో (రూ. 211.4) కంటే తక్కువ. కానీ నిజంగా Vi రీఛార్జ్ ప్లాన్ 209 రూపాయలు. అంతే కాకుండా Vi యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు కూడా నెలకు 746 నిముషాలు మాట్లాడినట్లు, ఇది ఎయిర్‌టెల్ (1071 నిముషాలు), జియో (1105 నిముషాలు)లతో పోలిస్తే చాలా తక్కువ.
సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను కూడా వోడాఫోన్ ఐడియా 20.83 లక్షలు కోల్పోయిందని ట్రాయ్ వెల్లడించింది. ఈ సమయంలో రిలయన్స్ జియో 2.7 మిలియన్ల 4G/5G వినియోగదారులను పొందగా.. భారతీ ఎయిర్‌టెల్ 2 మిలియన్లను పొందగలిగింది. మొత్తం మీద Vi ఉన్నదొకటైతే.. చెబుతున్నది మరొకటని స్పష్టంగా అర్థమవుతోంది.


