భక్తులకు సౌకర్యార్ధం శబరిమల మార్గంలో కనెక్టివిటీని పెంచే దిశగా తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. అలాగే, యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్‌ను మరింతగా అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.
శబరిమల యాత్రలో భక్తులు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబీకులు, సంబంధీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ బ్యాండ్లలో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను మోహరించింది. అలాగే పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సెల్ టవర్‌లను ఏర్పాటు చేసింది.
యాత్రీకుల భారీ రద్దీలోనూ మెరుగైన డేటా, వాయిస్ సేవలు అందించేలా మాసివ్ మిమో టెక్నాలజీతో అధునాతన ఎఫ్‌డీడీ, టీడీడీ లేయర్లను కూడా మోహరించినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. దీంతో గణపతి కోవిల్, నడప్పంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం, నీలక్కల్ పార్కింగ్, బస్టాండ్ వద్ద వొడాఫోన్ ఐడియా ద్వారా కనెక్టివిటీ గణనీయంగా బలోపేతం చేసినట్లు వివరించింది.
ఇక పిల్లల వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్‌కు సంబంధించి ప్రీ–రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. వీఐసురక్ష పోర్టల్‌తో పాటు కేరళవ్యాప్తంగా 25 వీఐ స్టోర్స్, 103 మినీ స్టోర్స్ మొదలైన వాటిల్లో రిజిస్టర్ చేసుకుని, పంబాలో ఏర్పాటు చేసిన వీఐ సురక్షా కియోస్క్‌ల నుంచి వీటిని పొందవచ్చని వివరించింది.


