న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పాత ఏజీఆర్ బాకీలను వచ్చే ఆరేళ్ల పాటు ఏటా రూ. 124 కోట్లు చెల్లించేలా వెసులుబాటునిచి్చంది.
2032 మార్చి–2035 మార్చి వరకు ఏటా రూ. 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పదేళ్లలో రూ. 1,144 కోట్లు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు, 2031–32 నుంచి 2040–41 మధ్య కాలంలో మిగతా బాకీలను కట్టాల్సి ఉంటుంది. ఈ పాత బకాయిని రూ. 87,695 కోట్లకు ఫ్రీజ్ చేసి, చెల్లింపులపై పాక్షికంగా మారటోరియం ఇస్తూ డిసెంబర్ 31న కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


