financial crisis
-
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ LTCM: లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్‌ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి. 2025లో, చిరకాల స్నేహితుడు జిమ్ రికార్డ్స్, సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని అడుగుతున్నాడు?, అని రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సంక్షోభానికి మాజీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి సంక్షోభం పెద్దదిగా మారుతుంది, ఎందుకంటే అవి సమస్యను ఎప్పటికీ పరిష్కరించవు. 971లో నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు ప్రారంభమైన సమస్య.. 1.6 ట్రిలియన్ డాలర్ల స్టూడెంట్ లోన్ ద్వారా ప్రేరేపితమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..నేను (రాబర్ట్ కియోసాకి) 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా.. ''ధనవంతులు డబ్బు కోసం పని చేయరు'', ''పొదుపు చేసేవారు ఓడిపోతారు''. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం డబ్బును ఆదా చేయడం కాదు. రాబోయే సంక్షోభం నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం.. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం మాత్రమే. ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు.2012లో రిచ్ డాడ్స్ ప్రాఫసీలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రాబోయే సంక్షోభం నుంచి కాపాడుకోండని రాబర్ట్ కియోసాకి తన సుదీర్ఘ ట్వీట్ ముగించారు.In 1998 Wall Street got together and bailed out a hedge fund LTCM: Long Term Capital Management.In 2008 the Cental Banks got together to bail out Wall Street.In 2025, long time friend, Jim Rickards is asking who is going to bail out the Central Banks?In other words each…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 18, 2025 -
అమెరికన్లకు కొత్త కష్టాలు.. లిప్ స్టిక్ ముద్దు.. చెడ్డీలు వద్దు!
దేశంలో .. కాదు కాదు.. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఏం బాలేదు. పెద్ద పెద్ద సంస్థలే వేలల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఉన్న వాళ్ళతో సర్దుకోండి కొత్త స్టాఫ్‌ను ఇచ్చేది లేదంటున్నాయి. హైక్స్ .. ఇంక్రిమెంట్స్ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. ఉన్న ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోండి.. అదే పదివేలు అంటూ సూచనలు చేస్తున్నాయి. అమెరికా ఐటీలో వచ్చిన పెనుమార్పు ఆయా రంగాల్లోని పనిచేస్తున్న వాళ్ల జీవితాలనే కాదు మొత్తం అమెరికా జీవితాల్లో పెనుమార్పులు తెచ్చిందట. అసలు పొదుపు.. ప్లానింగ్. డబ్బంటేనే లెక్కలేకుండా జీవించే అమెరికన్లు ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ముందే ఊహించి.. కుటుంబ ఖర్చులను భారీగా తగ్గిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.ఖరీదైన ఆహారం తినడం తగ్గించారట. అంటే లంచ్ టైములో స్టాఫ్‌తో పాటు అలా వెళ్లి రెస్టారెంట్లో తినే అలవాటున్న వాళ్ళు సైతం ఇప్పుడు ఆ పద్ధతి మానుకుని పద్ధతిగా ఇంటి నుంచి డబ్బా తీసుకువెళ్తున్నారట. బుద్ధిగా ఇంటి భోజనం చేస్తూ.. దిసీజ్ హెల్దీ యూ నో అంటున్నారట. దీంతోబాటు జెంట్స్ కూడా సెలూన్లలో ఖర్చు తక్కువ.. అంటే చావకరకం మసాజులు.. క్రాఫ్ స్టైల్స్ వంటివి కోరుతున్నారు తప్ప అప్పట్లా ఖరీదైన సేవలకు నో అంటున్నారట. అంటే ఓ నాలుగువేల ఖరీదుండే మసాజ్ ఎందుకులే గురూ ఓ. వెయ్యితో ముగించు.. అసలే రోజులు బాలేవు అంటున్నారట. దీంతోబాటు గోళ్ళ సంరక్షణ కు ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకని ఏకంగా కృత్రిమ గోళ్లు రకరకాల డిజైన్లలో రెడీమేడ్ కొనుక్కుని పెట్టుకుంటున్నారట. పెడిక్యూర్.. మానిక్యూర్ వంటివి చేయించాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద ఖర్చుతో టూర్లు తగ్గిస్తున్నారు.లిప్ స్టిక్ కొందాం.. చెడ్డీలు వద్దులే ఇదంతా ఒకెత్తు అయితే .. ఆర్థిక మాంద్యం ప్రభావమో.. భయం కారణంగానో కానీ రెండు అంశాల్లో మాత్రం చిత్రమైన తేడా కనిపిస్తోంది. దేశంలో లిప్ స్టిక్ కొనుగోళ్లు భారీగా పెరిగాయట. ఇదే తరుణంలో పురుషుల లో దుస్తులు.. ముఖ్యంగా డ్రాయర్లు కొనుగోళ్లు తగ్గినాయి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖరీదైన సౌందర్య సాధనాలు.. క్రీములు కొనడానికి మహిళలు వెనుకాడుతున్నారు. వేలకువేలు పెట్టి పార్లర్లకు వెళ్ళడానికి ఇష్టపడని మహిళలు.. పోనీ మంచి లిప్ స్టిక్ అయినా కొనుక్కుందాం అని నిర్ణయించుకుని వాటితో సర్దుకుంటున్నారట. అందంగా ఉండాలంటే పార్లర్ కు మాత్రమే వెళ్లాలా ఏంటి వదినా.. ఇదిగో ఈ లిప్ స్టిక్ వేసుకున్నాక నేను చాలా అందంగా ఉన్నానని మీ అన్నయ్యగారు మెచ్చుకున్నారు అంటూ ఒకరికోరు చెప్పుకుంటున్నారట.దీంతో మహిళలు జస్ట్ లిప్ స్టిక్ కొనుక్కుంటో సంతృప్తి చెందుతూ ఖర్చులు తగ్గిస్తున్నారట. అందుకే లిప్ స్టిక్ అమ్మకాలు పదిశాతం పెరిగాయట. మరోవైపు పురుషులు కూడా ప్యాంట్ షర్ట్. వంటివి బావుంటే చాలు లోపల వేసుకునే చెడ్డీలకు అంత ఖర్చు ఎందుకు ఉన్నవాటినే ఏదోలా సర్దుబాటు చేసుకుందాం.. వాటికోసం మళ్ళీ డాలర్లు ఎందుకు తగలెయ్యాలి.. లోపల వేసేది ఎవరు చూస్తారు అంటున్నారట. మొత్తానికి మాంద్యం ప్రభావం చెడ్డీల మీద కూడా పడింది. -సిమ్మాదిరప్పన్న. -
తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భోపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏష్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక యువకుడు తండ్రి తన ఫోన్ రిపేర్ చేయించలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలోని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫోన్ రిపేర్ చేయించలేననని, అలాగే కొత్త ఫోను కొనివ్వలేనని తండ్రి చెప్పాడంతో కుమారుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతితో ఆ తండ్రి కుమిలిపోతున్నాడు.ఏష్బాగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్ ఖాన్(18) బాగ్ ఫర్హత్ అఫజ్ పరిధిలోని ఓకాఫ్ కాలనీలో ఉంటున్నాడు. 12వ తరగతి పాసయిన సయీద్ ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలేజీలో చేరలేదు. నాలుగు రోజులుగా అతని ఫోను చార్జింగ్ కావడంలేదు. దీంతో ఆ ఫోనును రిపేర్ చేయించేందుకు మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అతను ఫోను రిపేరు(Phone repair)కు చాలా ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని అతను తండ్రికి చెప్పాడు. అయితే తండ్రి తన దగ్గర డబ్బులు లేవని, ఆ ఫోనుకు రిపేర్ చేయించలేనని, కొత్తది కొనివ్వలేనని చెప్పడంతో సయీద్ కలత చెందాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సయీద్ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య -
ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు.. స్పందించిన భారత్
మాల్దీవులు భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా ఉండబోతోంది. మాల్దీవులలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నామని భారత్ తెలిపింది. రుణ సంక్షోభం కారణంగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాల్దీవులలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ దేశంలో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కూడా జైస్వాల్ ప్రస్తావించారు. మాల్దీవుల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్‌కు ఆదాయ నష్టం జరుగుతున్నదని, ఇది ఆందోళన కలిగించే అంశమని జైస్వాల్ పేర్కొన్నారు.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)మధ్య జరగనున్న చర్చల గురించి జైస్వాల్ మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో కూడిన ఈ ఒప్పందాలను గౌరవించాలని భారత్ భావిస్తున్నదన్నారు. ఫిబ్రవరి 17 నుండి 20 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్- బీజేబీ మధ్య డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇవి సరిహద్దు భద్రతా దళాల మధ్య సయోధ్య పరిస్థితులకు సహకరిస్తాయి. భద్రత, వాణిజ్య మౌలిక సదుపాయాల కల్పనను సులభతరం చేయనున్నాయి.ఇది కూడా చదవండి: నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా..