2025లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. 2026లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది ప్రారంభమై 10 రోజులు కావొస్తుంది. ఈ సమయంలో గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 5400 పెరిగింది. దీంతో పసిడి ధరలు తారా స్థాయికి చేరుకున్నాయి.
జనవరి 1న హైదరాబాద్, విజయవాడలలో 1,35,060 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. నేటికి (జనవరి 10) రూ. 1,40,460 వద్దకు చేరింది. అంటే 10 రోజుల్లో గోల్డ్ రేటు 5,400 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,800 నుంచి రూ. 1,28,750 వద్దకు (రూ.4950 పెరిగింది) కదిలింది.
చెన్నైలో జనవరి మొదటి రోజు రూ. 1,36,140 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకు (జనవరి 10) 1,39,560 రూపాయల వద్దకు చేరింది. ఈ లెక్కన 10 రోజుల్లో రూ. 3420 పెరిగిందని స్పష్టమవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,400 నుంచి రూ. 1,29,000 వద్దకు (రూ.4600 పెరిగింది) కదిలింది.
ఢిల్లీలో 135210 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు పది రోజుల్లో రూ. 5400 పెరిగి.. 1,40,610 రూపాయలకు ఎగిసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,950 నుంచి రూ. 1,28,900 వద్దకు (రూ.4950 పెరిగింది) కదిలింది.
సిల్వర్ రేటు
వెండి ధరల విషయానికి వస్తే.. జనవరి 1న కేజీ సిల్వర్ రేటు రూ. 2.56 లక్షల దగ్గర ఉంది. జనవరి 10 నాటికి రూ. 2.75 లక్షల వద్దకు చేరింది. అంటే కేజీ సిల్వర్ రేటు జనవరి ప్రారంభం నుంచి రూ.19,000 పెరిగిందన్నమాట. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?


