బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్‌గా..! జస్ట్‌ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు.. | How Naman Chaudhary Lost 76 kg with a High-Protein Diet Plan | Sakshi
Sakshi News home page

Weight Loss Story: బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్‌గా..! జస్ట్‌ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..

Sep 16 2025 5:30 PM | Updated on Sep 16 2025 5:53 PM

Naman Chaudhary went from 150 kg to 74 kg in 3 years Goes Viral

బొద్దుగా ఉన్న వ్యక్తులు బరువు తగ్గడం కష్టమేమో అనుకుంటారు. కొందరి అధిక బరువు.. వామ్మో! ఇంత లావు అనేలా ఉంటుంది. అంతలా లావుగా ఉండి కూడా చాలా స్మార్ట్‌ లుక్‌లోకి మారిపోవడమే కాదు వెయిట్‌లాస్‌ అవ్వాలనుకునే వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందంటే..హీరోని తలపించేలా అతడి ఆహార్యం అత్యంత అందంగా మారిపోయింది. తనకు ఇదెలా సాధ్యమైందో కూడా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. మరి అంతలా బరువు తగ్గేందుకు అతడు ఏం ట్రిక్‌ ఫాలో అ‍య్యాడో సవివరంగా తెలుసుకుందాం..!

ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం సృష్టిస్తున్న అతడి స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..ఆ యువకుడే ఫిట్‌నెస్‌ ఔత్సాహికుడు నమన్‌ చౌదరి. బరువు తగ్గడం బోరింగ్‌గా, క్లిష్టంగా ఉండకూడదని చెబుతున్నాడు. కేవలం తెలివిగా తినడం ఎలాగో తెలుసుకుంటే చాలు వెయిట్‌లాస్‌ అవ్వడం చాలా సులభమని చెబుతున్నాడు. అందుకోసం తాను ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటూ..నిబద్ధతో ఉండటం నేర్చుకోవాలని చెబుతున్నాడు. 

ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలంగా ఉంచి, ఆకలిని నియంత్రించడమే కాకుండా కొవ్వు తగ్గడానికి మద్దతిస్తుందని చెబుతున్నాడు. ఆ విధంగానే తాను మూడేళ్లలో 150 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకున్నాని, అలా మొత్తం 76 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. అంతేగాదు బరువు తగ్గడానికి ఉపకరించిన తన ప్రోటీన్‌ భోజన ‍ప్రణాళికను కూడా పంచుకున్నాడు.

ప్రోటీన్ ఫుడ్‌ ప్లాన్‌..

ఉదయం అల్పాహారం (400 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)
ఎంపిక 1: 4 గుడ్డులోని తెల్లసొన + ఉల్లిపాయలు, టమోటాలతో గిలకొట్టిన ఆమ్లెట్‌, క్యాప్సికమ్ పాలకూరతో 50 గ్రా పనీర్ బుర్జీ, మల్టీగ్రెయిన్ టోస్ట్.

ఎంపిక 2 (గుడ్లు లేకుండా): కూరగాయలతో 60 గ్రా సోయా ముక్కలు స్టైర్-ఫ్రై, 50 గ్రా తక్కువ కొవ్వు పనీర్ గ్రిల్, ఒక చిన్న మల్టీగ్రెయిన్ టోస్ట్.

లంచ్ (350 కిలో కేలరీలు, 30 గ్రా ప్రోటీన్)
లంచ్ కోసం, ఇది తేలికగా ఉంచడం గురించి కానీ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండాలి. అతను 100 గ్రాముల సోయా ముక్కలు కర్రీ, 100 గ్రాముల ఉడికించిన బ్రోకలీ, ఒక చిన్న రోటీని ఎంచుకున్నాడు.

సాయంత్రం స్నాక్ (200 కిలో కేలరీలు, 20 గ్రా ప్రోటీన్)
చిప్స్ లేదా స్వీట్లకు బదులుగా, నామన్ 150 గ్రాముల తక్కువ కొవ్వు పనీర్ టిక్కాను ఎంచుకున్నాడు, పెరుగు, నిమ్మకాయ, సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసి, గ్రిల్ చేసిన లేదా  వేయించినది.

డిన్నర్ (350 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)
నామన్  డిన్నర్ కోసం ఉడికించిన పప్పు (పప్పు), వేయించిన టోఫు లేదా పనీర్, కూరగాయలు దోసకాయ, టమోటా సలాడ్ ఒక చిన్న రోటీ తీసుకున్నట్లు తెలిపాడు.

రోజువారీ మొత్తం
కేలరీలు 1300–1400 కిలో కేలరీలు, దాదాపు 120 గ్రా ప్రోటీన్‌తో ఉంటాయి. ఇదే నమన్ కడుపు నిండి ఉండటానికి తోడ్పడింది. పైగా అతని వ్యాయామాలకు ఇంధనంగానూ, కండరాలను కోల్పోకుండా కొవ్వును కరిగించడానికి సహాయపడింది. 

నామన్ పంచుకున్న వాటిలాగే  ప్రోటీన్ అధికంగా ఉండే తేలికైన భోజనం తినడం వల్ల కొవ్వు తగ్గడం వాస్తవికంగా స్థిరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫ్యాన్సీ ఫుడ్స్ లేదా విపరీతమైన డైట్స్ అవసరం లేదు. జస్ట్‌ ప్రోటీన్ అధికంగా, సమతుల్య పద్ధతిలో తింటే బరువు అదుపులో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు.

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం

(చదవండి: నానో బనానా ఏఐ చీర ట్రెండ్‌ ప్రకంపనం..! ప్లీజ్‌ సోమరిగా మారకు..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement