
జలవిహార్‌లోని ఆడిటోరియం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సమ్మిట్–2025ని ప్రారంభించారు.

ట్రాఫిక్ సమ్మిట్–2025కు ఆయన అతిథిగా సాయి ధరమ్ తేజ్

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురైనప్పుడు తన ప్రాణాలను హెల్మెట్టే కాపాడిందని సినీ నటుడు సాయి ధరమ్ తేజ అన్నారు.

ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని అన్నారు.

ఎలాంటి మినహాయింపులు లేకుండా ద్విచక్ర వాహనచోదకులందరూ హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ దయచేసి హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ నియమాలు పాటించండి, జీవితాన్ని విలువైందిగా పరిగణించండి.. మీతో పాటు ఇంట్లో మీ కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకోండి అంటూ సాయి ధరమ్ తేజ హితవు పలికారు.

















