
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నెల ప్రారంభమైన బిగ్బాస్ షో ఇప్పటికే ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ఆరుగురు కామనర్స్ హౌస్లో అడుగుపెట్టారు. అంతే కాకుండా రాను.. బొంబాయికి రాను అంటూ ఊపేసిన రాము రాథోడ్ సైతం బిగ్బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఫోక్ సాంగ్తో వైరలైన రాము రాథోడ్ బిగ్‌బాస్‌లోకి వెళ్లడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రాము రాథోడ్ను బిగ్బాస్ హౌస్లో చూసిన తల్లిదండ్రులు మాత్రం ఫుల్ ఎమోషనలవుతున్నారు. రామును అలా చూడడం మేము తట్టుకోలేకపోతున్నామని రాము తండ్రి ఏడ్చేశారు. మాకు చదువు రాదని.. రాము నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉంటుందని.. ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తే మాకు నచ్చడం లేదన్నారు. కానీ అవన్నీ ఆటలో భాగమని మాకు తెల్వదని అంటున్నారు రాము పేరేంట్స్. అంతేకాకుండా రాము అందరికీ నచ్చే మనిషి అని అతని తల్లి అన్నారు. అందరినీ బాగా పలకరిస్తాడని చెప్పారు. రామును టీవీల్లో చూస్తుంటే మాకు బాధగా ఉందని అతని తండ్రి ఎమోషనల్గా మాట్లాడారు. నువ్వు చివరికీ వరకు హౌస్లో ఉండి కప్ గెలవాలని రాము తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాము గెలిస్తే మహబూబ్నగర్లోని గోపాలపురమంతా డ్యాన్స్ చేస్తామని అంటున్నారు అతని తల్లిదండ్రులు. ఏదేమైనా ఒక్క పాటతో ఫేమ్ తెచ్చుకుని బిగ్బాస్ వరకు వెళ్లిన రాము రాథోడ్ కప్ గెలవాలని అతని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు.