సౌతిండియా నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్. ఆమె తాజాగా నటించిన చిత్రం 'సన్ ఆఫ్' (Son Of )ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ రెస్పాన్ వస్తోంది. ఈ మూవీలో మీరా చేసిన తన పాత్రకు.. ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఉత్తర భారతీయురాలైనా, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో కీలక పాత్రలో నటించబోతోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి లాంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం మీరా రాజ్‌కు బిగ్ ఛాన్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై మీరా రాజ్‌కు అపారమైన గౌరవం ఉంది.“నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను” అని మీరా భావోద్వేగంగా చెప్పింది.
ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్‌పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.


