Kanchana 4 Movie
-
‘కాంచనా -4’: ఈసారి పూజా హెగ్డే, నోరా ఫతేహిలతో రచ్చ!
ప్రముఖ కొరియోగ్రాఫర్, కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు శాఖల్లో విజయవంతంగా రాణిస్తున్న నటుడు రాఘవ లారెన్స్. ఈయన పలు చిత్రాలు రూపొందించినా కాంచన చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. హర్రర్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో ఈయన రూపొందించిన కాంచన, కాంచన స్వీకెల్స్ అనూహ్య విజయాన్ని సాధించాయి. సాధారణంగా ఒక చిత్రానికి సీక్వెల్ రూపొందితే అది సక్సెస్ కావడమే అరుదుగా మారింది. అలాంటిది రాఘవ అదే జానర్లో వరుసగా మూడు సీక్వెల్స్ రూపొందించి విజయం సాధించారు. తాజాగా నాలుగో సీక్వెల్‌తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. కాంచన–4గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తన రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో క్రేజీ నటీమణులు పూజాహెగ్డే, బాలీవుడ్ బ్యూటీ నోరాఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని తమిళనాడులో సన్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుండడం విశేషం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. అందులో కండలు తిరిగిన సిక్స్‌ప్యాక్ బాడీతో రాఘవ లారెన్‌న్స్ నిలబడి ఉండగా వెనుక ఆయన మరో రూపం, చుట్టూ భూతాల ముఖాలు ఉన్నాయి. అలా బీభత్సంగా ఉన్న ఆ పోస్టర్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. -
‘కాంచన 4'లో కొత్త అందం.. చాన్స్ ఇచ్చిన రాఘవ లారెన్స్
సౌతిండియా నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్. ఆమె తాజాగా నటించిన చిత్రం 'సన్ ఆఫ్' (Son Of )ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ రెస్పాన్ వస్తోంది. ఈ మూవీలో మీరా చేసిన తన పాత్రకు.. ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఉత్తర భారతీయురాలైనా, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో కీలక పాత్రలో నటించబోతోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి లాంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం మీరా రాజ్‌కు బిగ్ ఛాన్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై మీరా రాజ్‌కు అపారమైన గౌరవం ఉంది.“నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను” అని మీరా భావోద్వేగంగా చెప్పింది.ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్‌పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.


