‘కాంచనా -4’: ఈసారి పూజా హెగ్డే, నోరా ఫతేహిలతో రచ్చ! | Pooja Hegde, Nora Fatehi Play Key Role In Raghava Lawrence Kanchana 4 | Sakshi
Sakshi News home page

‘కాంచనా -4’: ఈసారి పూజా హెగ్డే, నోరా ఫతేహిలతో రచ్చ!

May 14 2026 8:21 AM | Updated on May 14 2026 11:54 AM

Pooja Hegde, Nora Fatehi Play Key Role In Raghava Lawrence Kanchana 4

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు శాఖల్లో విజయవంతంగా రాణిస్తున్న నటుడు రాఘవ లారెన్స్‌. ఈయన పలు చిత్రాలు రూపొందించినా కాంచన చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. హర్రర్‌, కామెడీ, థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈయన రూపొందించిన కాంచన, కాంచన స్వీకెల్స్‌ అనూహ్య విజయాన్ని సాధించాయి. సాధారణంగా ఒక చిత్రానికి సీక్వెల్‌ రూపొందితే అది సక్సెస్‌ కావడమే అరుదుగా మారింది. అలాంటిది రాఘవ అదే జానర్లో వరుసగా మూడు సీక్వెల్స్‌ రూపొందించి విజయం సాధించారు. 

తాజాగా నాలుగో సీక్వెల్‌తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. కాంచన–4గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తన రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తూ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో క్రేజీ నటీమణులు పూజాహెగ్డే, బాలీవుడ్‌ బ్యూటీ నోరాఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని తమిళనాడులో సన్‌ పిక్చర్స్‌ సంస్థ విడుదల చేయనుండడం విశేషం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవల విడుదల చేశారు. అందులో కండలు తిరిగిన సిక్స్‌ప్యాక్‌ బాడీతో రాఘవ లారెన్‌న్స్‌ నిలబడి ఉండగా వెనుక ఆయన మరో రూపం, చుట్టూ భూతాల ముఖాలు ఉన్నాయి. అలా బీభత్సంగా ఉన్న ఆ పోస్టర్‌ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement