కాంచన-4లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా? | Kollywood actress Nayanthara will acts In Kanchana 4 Movie | Sakshi
Sakshi News home page

Kanchana 4 Movie: కాంచన-4లో స్టార్ హీరోయిన్ స్పెషల్ రోల్

Jun 14 2026 7:05 AM | Updated on Jun 14 2026 7:05 AM

Kollywood actress Nayanthara will acts In Kanchana 4 Movie

సినీ ప్రియులను ఎక్కువగా భయపెట్టిన చిత్రాల్లో ఈ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. రాఘవ లారెన్స్ తన నటన, గాంభీర్యంతో ఆడియన్స్‌ను భయపెట్టిన తీరు ఆకట్టుకుంది. కాంచన సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌లో కాంచన-4 కూడా వచ్చేస్తోంది. ఈ మూవీతో రాఘవ లారెన్స్ బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ రోల్‌కు ఆమెను ఎంపిక చేశారని టాక్. ఈ హారర్‌ కామెడీ చిత్రంలో నయన్ పాత్ర హైలెట్‌గా ఉండనుందని సమాచారం. ఈ మూవీలో ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నట్లు ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ ‍అయితే జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్‌ ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement