breaking news
meera Raj
-
‘సన్ ఆఫ్’ వస్తోన్న రెస్పాన్సే నా సక్సెస్ : సాయి సింహాద్రి
సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో సాయి సింహాద్రి మాట్లాడుతూ–‘‘యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న నేను సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. ఏడాదిన్నర పాటు ఇక్కడే ఉంటూ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సినిమాను పూర్తి చేశాను. ‘సన్ ఆఫ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే నా సక్సెస్’’ అని చెప్పారు.హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ ‘మంచి ఎమోషనల్ బాండింగ్ ఉన్న ‘సన్ ఆఫ్’లో తండ్రీ కొడుకుల మధ్య కనెక్టింగ్ చేసే మంచి రోల్లో నటించటం నటిగా నాకు మంచి గుర్తింపునిచ్చింది’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్, సంఘర్షణ కాన్సెప్ట్ నాకు నచ్చడంతో రిలీజ్‌కి ముందుకు వచ్చాను’’ అని చెప్పారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి. -
‘కాంచన 4'లో కొత్త అందం.. చాన్స్ ఇచ్చిన రాఘవ లారెన్స్
సౌతిండియా నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్. ఆమె తాజాగా నటించిన చిత్రం 'సన్ ఆఫ్' (Son Of )ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ రెస్పాన్ వస్తోంది. ఈ మూవీలో మీరా చేసిన తన పాత్రకు.. ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఉత్తర భారతీయురాలైనా, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో కీలక పాత్రలో నటించబోతోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి లాంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం మీరా రాజ్‌కు బిగ్ ఛాన్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై మీరా రాజ్‌కు అపారమైన గౌరవం ఉంది.“నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను” అని మీరా భావోద్వేగంగా చెప్పింది.ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్‌పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.


