
వలసదారులపై మొదటి నుంచే కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించారు. అంతే కాకుండా.. అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు, తాత్కాలికంగా తమ నిపుణులను తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ చర్య విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. సంక్లిష్ట ఉత్పత్తుల తయారీలో అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
ఓడలు, కంప్యూటర్లు, రైళ్లు, సెమీకండక్టర్లు వంటి క్లిష్టమైన ఉత్పత్తులను నిర్మించే విదేశీ కంపెనీలు.. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సొంత దేశాల నుంచి నిపుణులను తీసుకురావాలని ట్రంప్ అన్నారు. మనం ఇలా చేయకపోతే.. భారీ పెట్టుబడులను అమెరికా కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఇతర దేశీయలను.. అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. మేము కంపెనీలను మాత్రమే కాకుండా.. వారి ఉద్యోగులను కూడా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. క్లిష్టమైన రంగాల్లో కూడా మన దేశం రాణిస్తుంది. ఇది దేశ భవిష్యత్ కూడా అని పేర్కొన్నారు.