దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గత వారం రోజుల్లో (డిసెంబర్ 14 – డిసెంబర్ 21) హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయ మార్పులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు మొత్తంగా చూస్తే స్వల్పంగా పెరిగాయి.
ధరల మార్పు ఇలా..
డిసెంబర్ 14న రూ.1,33,910గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర.. పెరుగుతూ.. తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల అనంతరం నికరంగా రూ.270 పెరిగింది.
ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే డిసెంబర్ 14న రూ.1,22,750తో ప్రారంభమై, డిసెంబర్ 21న రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. నిరకంగా చూస్తే వారం రోజుల్లో రూ.250 ఎగిసింది.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
బంగారాన్ని ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ‘సేఫ్-హేవెన్’గా కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం డిమాండ్.. ధరలు పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ బంగారం ధరలు యూఎస్ డాలర్ బలం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలంగా మారితే బంగారం ఫ్యూచర్స్‌పై ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.
డిసెంబర్‌లో పండుగలు, శుభదినాలు, పెళ్లి సీజన్ మొదలైన సందర్భాల నేపథ్యంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.
ఇక స్థానికంగా ఉన్న పన్నులు, సరఫరా, డిమాండ్ కూడా రోజువారీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది.


