మారిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరట! | Gold Rates changes by Evening 4th February in Telugu States | Sakshi
Sakshi News home page

మారిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరట!

Feb 4 2026 6:51 PM | Updated on Feb 4 2026 7:08 PM

Gold Rates changes by Evening 4th February in Telugu States

బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి కాస్త ఊరటనిచ్చాయి.

హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.6050 పెరిగి రూ. 1,47,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.5050లకే పరిమితమై  రూ.1,46,150లకు దిగివచ్చింది.

ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.6600 ఎగిసి రూ. 1,60,530 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.5510 లకు నెమ్మదించి రూ.1,59,440లకు చేరుకుంది.

అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement