అధిక బరువు ఊబకాయంతో నానాబాధలు పడుతున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే ఒక కొత్త గట్ బాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ఈ స్పెషల్ బాక్టీరియాను అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, టురిసిబాక్టర్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం గట్ బాక్టీరియా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, బరువు పెరగడాన్ని తగ్గిస్తుందని ఉటా విశ్వవిద్యాలయం బృందం కనుగొంది. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు.
ట్యూరిసిబాక్టర్ (Turicibacter) అనే పేగు బాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఊబకాయం ఉన్నవారిలో టురిసిబాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇది మానవులలో కూడా ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది. గట్ బాక్టీరియాను సర్దుబాటు చేయడం ద్వారా బరువును నియంత్రించడానికి కొత్త మార్గాల అన్వేషణకు ఈ ఫలితాలు దారితీయవచ్చని సెల్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు జూన్ రౌండ్, కేంద్ర క్లాగ్ తెలిపారు.
రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిని, హైఫ్యాట్ డైట్‌లోని సెరామైడ్ స్థాయిలను రాడ్ ఆకారంలోని టురిసిబాక్టర్ సింగిల్ హ్యాండెడ్‌గా తగ్గిస్తుందని కను గొన్నామన్నారు. అయితే టురిసిబాక్టర్ ప్రభావాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం లేదు; విభిన్నమైన గట్ బాక్టీరియా బహుశా జీవక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే జంతు నమూనాల ఆధారంగా ఈ ఫలితాలు ప్రజలకు వర్తించకపోవచ్చని కూడా చెప్పారు.

అధిక కొవ్వు ఆహారంతో సెరామైడ్ స్థాయిలు పెరుగుతాయి. అధిక స్థాయి సిరామైడ్‌లు టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె జబ్బులతో సహా అనేక జీవక్రియ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ టురిసిబాక్టర్ ఉత్పత్తి చేసే కొవ్వులు అధిక కొవ్వు ఆహారం మీద ఎలుకలకు కూడా సిరామైడ్ స్థాయిలను తక్కువగా ఉంచుతాయి. ట్యూరిసిబాక్టర్ చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడే కొవ్వు అణువులను ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎలుకలలో బరువు తగ్గడాన్ని గమనించినప్పటికీ, ఇది మానవులలో ఎంతవరకు సాధ్యపడుతుందని అనేది చూడాలన్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించేందుకు, అధిక బరువు పెరగకుండా నిరోధించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి టురిసిబాక్టర్, ఈ ప్రభావాన్ని చూపే లిపిడ్‌ను గుర్తించడం భవిష్యత్తులో ఇది తొలి ఫ్యాక్టర్ కాగాలదని పరిశోధకులు తెలిపారు. అలాగే వ్యక్తిగత సూక్ష్మజీవులను మరింత పరిశోధించడం ద్వారా, భవిష్యత్తులో సూక్ష్మ జీవులను ఔషధంగా తయారు చేయగలమనీ, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో వివిధ కీటకాల కన్సార్టియంను సృష్టించడానికి సురక్షితమైన బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉందని అని వర్సిటీ పరిశోధకుడు క్లాగ్ అన్నారు.
గట్ మైక్రోబయోమ్‌లోని తేడాలు - గట్‌లోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు - ఊబకాయం మరియు బరువు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి, మైక్రోబయోమ్‌ను మార్చడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడే అవకాశాన్ని పెంచుతుంది. కానీ వ్యక్తి ప్రేగులో వందలాది విభిన్న సూక్ష్మజీవుల జాతులు ఉంటాయి, ఏ జాతి సహాయపడుతుందో చెప్పడం కష్టతరం. అయితే ఈ ఫలితాలు మానవులకి కూడా వర్తిస్తే, ట్యూరిసిబాక్టర్-ఉత్పన్న సమ్మేళనాలు జీవక్రియ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన చికిత్సా విధానాలుగా ఉంటాయనడంలో సందేహం లేదు.


