మహిళలపై ఇరాన్ ప్రతీకారం.. జైళ్లలో అత్యాచారాలు? | Rape of women in Iranian prisons | Sakshi
Sakshi News home page

మహిళలపై ఇరాన్ ప్రతీకారం.. జైళ్లలో అత్యాచారాలు?

Feb 4 2026 12:02 AM | Updated on Feb 4 2026 12:09 AM

Rape of women in Iranian prisons

ఇరాన్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.  అక్కడి సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో వారిని అక్కడి ప్రభుత్వం బంధించి జైళ్లలో వేసింది. అయితే కారాగారాలలో  వారిపై అత్యాచారం చేసి హతమారుస్తున్నారని ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

ఖమేనీ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఇరాన్‌లో పెద్దఎత్తున నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే.  లక్షల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్లపైకి  వచ్చి పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. వారిలో కొంతమంది హిజాబ్‌ తొలగించి సిగరెట్‌తో ఖమేనీ ఫోటోకు నిప్పంటిస్తూ నిరసనలు తెలిపారు. దీంతో అక్కడి భద్రతా బలగాలు వారిని అరెస్టు చేశాయి. తాజాగా ఖమేనీ ప్రభుత్వం వారిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్-జర్మన్ జర్నలిస్టు మిచెల్‌ అబ్దోల్లాహి  ఇరాన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరాన్‌ ప్రభుత్వంపై నిరసన చేసిన మహిళలపై జైళ్లలో అత్యాచారాలు చేస్తున్నారని, వారిని అంగవైకల్యానికి గురిచేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా సిగరెట్‌లతో కాల్చుతూ చిత్రవధలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు గర్భం దాల్చితే వాటిని తొలగిస్తున్నారని పేర్కొన్నారు.

అయితే వారు పెడుతున్న హింసల్ని తట్టుకోలేక మరణిస్తే  మరణిస్తే వారి మృత దేహాలను ఎవరికి తెలియకుండా కాల్చి వేస్తున్నారని తెలిపారు. జైళ్లలో హింస జరుగుతున్న సంగతి ఎవరికి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా చేస్తున్నారని జర్నలిస్టు పేర్కొన్నారు. అయితే ఇరాన్‌లో జరిగిన ఆందోళనల కారణంగా దాదాపు ఐదువేల మంది పౌరులు మృతిచెందిన సంగతి తెలిసిందే.                         

 

Advertisement
 
Advertisement
Advertisement