ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) వార్షికోత్సవ వేడుకలను నీతా అంబానీ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ.. పూజా కార్యక్రమంతో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''కుటుంబం అంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకునే ప్రదేశం, మన కష్టాలను ఆనందాలను పంచుకునే ప్రదేశం, విభేదాలను పరిష్కరించుకోవడం ఎలా అని తెలుసుకునే ప్రదేశం. విలువలు, సంస్కృతి అనేది తాతలు, తల్లిదండ్రుల నుంచి లభిస్తాయని పేర్కొన్నారు. నా అతిపెద్ద బలం, నా చీర్‌లీడర్ నా భర్త ముఖేష్" అని అన్నారు.
ఈ వేడుకలకు ముకేశ్ అంబానీ, ఇషా అంబానీ మాత్రమే కాకుండా.. ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ మొదలైన సెలబ్రిటీలు హాజరయ్యారు.


