నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (NAB) ఇండియా 75వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంధులకు అండగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున రాబోయే ఐదేళ్లలో రూ.5 కోట్ల విరాళాన్ని అందజేస్తామని నీతా అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్, నాబ్ సంయుక్త కృషితో ఇప్పటివరకు 22,000 మందికి పైగా అంధులకు చూపు తెప్పించారు.


