అదే బైక్‌.. అప్‌డేటెడ్‌ వెర్షన్‌ | Updated Bajaj Pulsar 220F New KTM Duke 160 Variant Launched in India | Sakshi
Sakshi News home page

అదే బైక్‌.. అప్‌డేటెడ్‌ వెర్షన్‌

Dec 21 2025 10:58 AM | Updated on Dec 21 2025 11:17 AM

Updated Bajaj Pulsar 220F New KTM Duke 160 Variant Launched in India

బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ ‘2026 పల్సర్‌ 220ఎఫ్‌’ మోటార్‌సైకిల్‌ను కొత్త అప్‌డేట్‌లతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్‌–షోరూం ధర రూ. 1.28 లక్షలు. స్వల్ప స్టైలింగ్, రంగులతో పాటు ప్రధానంగా కాస్మెటిక్, ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. రైడింగ్‌ సేఫ్టీని పటిష్టం చేసేందుకు సింగిల్‌–ఛానల్‌ ఏబీఎస్‌ నుంచి డ్యూయల్‌–ఛానల్‌ ఏబీఎస్‌కి అప్‌గ్రేడ్‌ చేశారు.

మరింత స్పష్టంగా కనిపించేలా, మోడ్రన్‌ లుక్‌తో ఎల్‌ఈడీ టర్న్‌–సిగ్నల్స్‌(ఇండికేటర్స్‌) అమర్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీతో కూడిన డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ ఈ మోడల్‌లో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్‌ చెర్రీ రెడ్, బ్లాక్‌ ఇంక్‌ బ్లూ, బ్లాక్‌ కాపర్‌ బీయి, బ్లాక్‌ కాపర్‌ బేజ్‌ గ్రీన్‌ లైట్‌ కాపర్‌ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.

అత్యుత్తమ పనితీరుతో అభిమానులను ఆకట్టుకున్న 220సీసీ ట్విన్‌ స్పార్క్‌ డీటీఎస్‌–ఐ ఇంజిన్‌ను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచేసింది. ఇది ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ టెక్నాలజీతో, ఆయిల్‌–కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ సెటప్‌లో వస్తుంది. ఈ ఇంజిన్‌ 8,500 ఆర్‌పీఎం వద్ద 20.9 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తూ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది.

‘కేటీఎం డ్యూక్‌ 160’ కొత్త వేరియంట్‌

ప్రీమియం బైక్‌ విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కేటీఎం సంస్థ ’160 డ్యూక్‌’లో మరింత అధునాతన వేరియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.78 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌–షోరూం). అయిదు అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. జెన్‌–3 కేటీఎం 390 డ్యూక్‌ నుంచి దీనిని ప్రేరణగా తీసుకున్నారు.

రైడర్‌ తన అభిరుచికి తగ్గట్లు డిస్‌ప్లే థీమ్‌ను మార్చుకోవచ్చు. రైడర్‌ మెనూలు, కనెక్టివిటీ వంటి బైక్‌ ఫంక్షన్‌లను నియంత్రించేందుకు 4–వే స్విచ్‌ క్యూబ్‌ కూడా ఉంటుంది. నావిగేషన్, బ్లూటూత్‌ కనెక్టివిటీ  ఉన్నాయి. ఈ బైక్‌ను కేటీఎం మై రైడ్‌ యాప్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement