3 లక్షల యమహా స్కూటర్లు రీకాల్‌.. | Yamaha Recalls Over 3 Lakh Scooters in India Due to Front Brake Issue | Sakshi
Sakshi News home page

3 లక్షల యమహా స్కూటర్లు రీకాల్‌..

Jan 24 2026 11:51 AM | Updated on Jan 24 2026 12:05 PM

Yamaha Recalls Over 3 Lakh Scooters in India Due to Front Brake Issue

యమహా మోటార్ ఇండియా కంపెనీ 3 లక్షలకు పైగా స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రేజెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ మోడళ్లకు చెందిన స్కూటర్లు ఉన్నాయి.

2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైన 125 సీసీ స్కూటర్ మోడళ్లలో మొత్తం 3,06,635 యూనిట్లకు స్వచ్ఛంద రీకాల్ ప్రచారాన్ని కంపెనీ ప్రారంభించింది.

కొన్ని ప్రత్యేక ఆపరేటింగ్ పరిస్థితుల్లో, ఎంపిక చేసిన యూనిట్లలో ఫ్రంట్ బ్రేక్ కాలిపర్ పనితీరు పరిమితంగా ఉండే అవకాశం ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ చేపట్టినట్లు యమహా వెల్లడించింది. ఈ రీకాల్ పూర్తిగా స్వచ్ఛందంగా చేపట్టినదని యమహా స్పష్టం చేసింది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ రీకాల్ పరిధిలోకి వచ్చే అన్ని వాహనాలకు సంబంధిత భాగాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా మార్చి ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. రీకాల్ పరిధిలోకి వచ్చే స్కూటర్ల యజమానులను యమహా డీలర్లు నేరుగా సంప్రదిస్తారు. అలాగే వాహన యజమానులు తమ సమీపంలోని అధికారిక యమహా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి, తమ వాహనం రీకాల్‌కు అర్హత కలిగి ఉందో లేదో తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement