కియా కారెన్స్ క్లావిస్ కొత్త వేరియంట్ | Kia Carens Clavis gets new HTE EX variant with sunroof | Sakshi
Sakshi News home page

కియా కారెన్స్ క్లావిస్ కొత్త వేరియంట్.. సన్‌రూఫ్‌తో..

Jan 16 2026 5:38 AM | Updated on Jan 16 2026 5:41 AM

Kia Carens Clavis gets new HTE EX variant with sunroof

కియా కారెన్స్ క్లావిస్ లైనప్‌నకు కొత్త వేరియంట్‌ను జోడించింది. సరికొత్త కొత్త హెచ్‌టీఈ HTE (EX) వేరియంట్‌ను విడుదల చేసింది. వీటిలో G1.5 పెట్రోల్ వేరియంట్‌ ధర రూ.12,54,900 (ఎక్స్-షోరూమ్), G1.5 టర్బో-పెట్రోల్ వేరియంట్‌ ధర రూ. 13,41,900, D1.5 డీజిల్ వేరియంట్‌ ధర రూ.14,52,900గా కంపెనీ నిర్ణయించింది.

హెచ్‌టీఈ (ఈఎక్స్‌) వేరియంట్ మూడు ఐసీఈ పవర్ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అలాగే ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న హెచ్‌టీఈ (O) వేరియంట్‌ కంటే కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. మరిన్ని మెరుగైన ఫీచర్లను కోరుకునే కస్టమర్ల కోసం దీన్ని తీసుకొచ్చారు.

తొలిసారి సన్‌రూఫ్‌
హెచ్‌టీఈ (ఈఎక్స్‌) వేరియంట్‌లో కీలక అప్‌డేట్‌ కారెన్స్ క్లావిస్ G1.5 పెట్రోల్ వెర్షన్లో స్కై లైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. ఈ పవర్‌ట్రెయిన్‌తో సన్‌రూఫ్ ఇవ్వడం ఇదే మొదటిసారి.

మెరుగైన ఫీచర్లు, మరింత సౌకర్యం
హెచ్‌టీఈ (ఈఎక్స్‌) వేరియంట్‌లో పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను జోడించడం ద్వారా క్యాబిన్ సౌకర్యాన్ని మరింత పెంచారు. వెలుపల భాగంలో ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), ఎల్‌ఈడీ పొజిషన్ లైట్లు ఇచ్చారు.

అంతర్గతంగా, మెరుగైన వెలుతురు కోసం ఎల్‌ఈడీ క్యాబిన్ లైట్లు, అలాగే డ్రైవర్ వైపు పవర్ విండోకు ఆటో అప్ / డౌన్ ఫంక్షన్ అందించడం ద్వారా సౌకర్యంతో పాటు భద్రతను కూడా మెరుగుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement