సిరియా అల్లకల్లోలం.. అమెరికా ప్రతీకార దాడులు | US launches Operation Hawkeye Strike On Syria | Sakshi
Sakshi News home page

సిరియా అల్లకల్లోలం.. అమెరికా ప్రతీకార దాడులు

Dec 20 2025 9:12 AM | Updated on Dec 20 2025 9:12 AM

US launches Operation Hawkeye Strike On Syria

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా, సిరియా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరియాలోని (Syria) ఉగ్రస్థావరాలపై అమెరికా (US Strikes on Syria) దళాలు విరుచుకుపడుతున్నాయి. అమెరికన్లపై ఉగ్రదాడికి ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలను టార్గెట్‌ చేసి అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.  

కాగా, ఈ నెల 13న సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS) గ్రూప్‌కు చెందిన ఉగ్రవాది దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్‌ సభ్యులు గాయపడిన విషయం తెలిసిందే. దీనికీ ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)‌, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ (Pete Hegseth) ప్రకటించారు. ఈ సందర్బంగా సిరియాలో ఐసిస్‌ ఉగ్రవాదులను ఏరివేయడానికి ‘ఆపరేషన్‌ హాక్‌ఐ స్ట్రైక్‌’ను (Operation Hawkeye Strike) ప్రారంభించామని తెలిపారు. ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా జవాబిచ్చామన్నారు.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లో ఈ దాడులు ఐసిస్‌ బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సమూహాన్ని లక్ష్యంగా చేసుకునే అమెరికా ప్రయత్నానికి పూర్తిగా మద్దతు ఇస్తున్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికన్లపై దాడి చేసే దుర్మార్గులైన ఉగ్రవాదులందరికీ ఈ దాడి ఓ హెచ్చరిక. మీరు ఏ విధంగా అమెరికాపై దాడి చేసినా లేదా బెదిరించినా గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మీరు దెబ్బతినవలసి వస్తుంది వార్నింగ్‌ ఇచ్చారు.

మరోవైపు, పీట్‌ హెగ్సెత్‌ స్పందిస్తూ.. సిరియాలోని ఐసిస్‌ ఫైటర్లు, ఆయుధాగారాలు, మౌళికవసతులను నాశనం చేసేందుకు అమెరికా దళాలు ఆపరేషన్‌ హాక్‌ఐ స్ట్రైక్‌ ప్రారంభించాయని తెలిపారు. అయితే, ఇది యుద్ధానికి ప్రారంభం కాదు. ప్రతీకారం మాత్రమే అని చెప్పుకొచ్చారు. గత శనివారం (డిసెంబర్ 13న) పాల్మైరాలో అమెరికా దళాలపై జరిపిన దాడికి ప్రతిగా దీనిని చేపట్టామన్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ నాయకత్వంలో అమెరికా ప్రజలను రక్షించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయం అని చెప్పారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికా మిమ్మల్ని వేటాడి, కనిపెట్టి నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement