
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు పేర్కొన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆధునిక చరిత్రలో అతిపెద్ద మార్పు.. అని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఏఐ వల్ల చాలా మంది తెలివైన విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు, కాబట్టి.. ఏఐ నన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు.

''కొన్నేళ్ల క్రితం.. పేద తండ్రి పాఠశాలకు వెళ్లు, మంచి గ్రేడ్‌లు పొందు, ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, అప్పుల నుంచి బయటపడు, డబ్బు ఆదా చేయు, మరియు స్టాక్‌లు, బాండ్‌లు, మ్యూచువల్ ఫండ్‌ల వంటి విభిన్నమైన పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టు అని చెప్పే మాటలకు బదులుగా.. ధనవంతుడైన తండ్రి సలహాను అనుసరించాను. నేను ఒక వ్యవస్థాపకుడిని అయ్యాను, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాను, అప్పును ఉపయోగించాను. డబ్బును ఆదా చేయడానికి బదులుగా, నేను నిజమైన బంగారం, వెండి, నేడు బిట్‌కాయిన్‌లను ఆదా చేస్తున్నాను'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే.. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?