
భారతదేశంలో రాజ్యాంగ బద్దంగా.. రాష్ట్రపతి తరువాత రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి. ఈ బాధ్యతలను సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు శుక్రవారం(సెప్టెంబర్ 12వ తేదీ) చేపట్టారు. అయితే దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎటువంటి జీతం ఉండదని బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అయితే.. జీతం తప్ప, ఇతర ప్రోత్సాహకాలు లభించే ఏకైక పదవి ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.
భారత ఉపరాష్ట్రపతిగా ఎటువంటి జీతం తీసుకోనప్పటికీ.. ఈ పదవిలో ఉన్న వ్యక్తి, రాజ్యసభ ఛైర్మన్‌గా నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతారు ((2018లో దీనిని రూ.1,25,000 నుంచి సవరించారు). ఉపరాష్ట్రపతి జీతం, భత్యాలు పార్లమెంటు అధికారుల జీత భత్యాల 1953 చట్టం ప్రకారం నిర్ణయిస్తారు. ఇందులో ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేక జీత నిబంధన లేదు.
ఉపరాష్ట్రపతికి లభించే ప్రయోజనాలు
భారత ఉపరాష్ట్రపతికి జీతం లేకపోయినప్పటికీ.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉచిత వసతి, వైద్య సంరక్షణ, రైలు & విమాన ప్రయాణం, ల్యాండ్‌లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సర్వీస్, వ్యక్తిగత భద్రత, సిబ్బంది మొదలైనవి ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ
పదవీ విరమణ తరువాత కూడా అనేక సదుపాయాలు కల్పిస్తూ.. నెలకు సుమారు రూ. 2 లక్షల పెన్షన్, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్, సెక్యూరిటీ, డాక్టర్, ఇతర సిబ్బంది సేవలను పొందుతూనే ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి మరణించిన తరువాత.. ఆయన భార్యకు కూడా కొన్ని సదుపాయలను కల్పిస్తారు.