డిసెంబర్ 13, 2021 సరిగ్గా ఇరవై నాలుగేళ్ల క్రితం ఇదే రోజు యువధ్ధేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 140కోట్ల ప్రజల దేవాలమైన ప్రజాస్వామ్య భవనంపై పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరులను ఎదురుకున్నారు. వీరోచితంగా పోరాడి ప్రజాస్వామ్య ఆయువుపట్టైన పార్లమెంట్ భవనంలోకి వెళ్లకుండా ఆటంకవాదులను అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బందితో సహా 14 మంది ప్రాణాలు వదిలారు.
ఆ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. దాదాపు ఉదయం 11 గంటల సమయం పార్లమెంటులోకి ఒక అంబాసీడర్ కారులో నకిలీ గుర్తింపు పత్రాలతో ఐదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. ఆ వెంటనే ఏకే-47 గ్రేనేడ్లు, పిస్తల్స్‌తో కాల్పులు ప్రారంభించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై ఎదురుకాల్పులు ప్రారంభించారు. అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ ఉగ్రవాదులను తుదముట్టించారు. ఈ ఘటనలో 6గురు భద్రతా సిబ్బంది ఇద్దరు పార్లమెంట్ సిబ్బంది ఒక తోటమాళి ప్రాణాలు కోల్పోయారు. వారి ధైర్యసాహసాలను స్మరిస్తూ పార్లమెంటులో ఈ రోజు వారికి నివాళులర్పించారు.
ఉపరాష్ట్రపతి సీ.పీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ ఆరోజు ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అధికార ప్రతిపక్ష నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంపై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్యగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. ఈ దాడిని ఎదుర్కోవడంలో ప్రాణాలర్పించిన యోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు.
పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి సమయంలో, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కమలేశ్ కుమారి అపార ధైర్యసాహసాలు ప్రదర్శించారు. కాల్పులు జరుగుతున్న లెక్కచేయకుండా ఉగ్రవాదుల కదలికలపై సమాచారం భద్రతా బలగాలకు అందించారు. దీంతో ఉగ్రవాదులు పార్లమెంటు భవనంలోకి వెళ్లకుండా నిరోధించి వారిని కాల్చిపడేశారు. దీంతో పెద్దగండం గట్టెక్కింది. ఈ ఆపరేషన్‌లో తీవ్రంగా గాయపడిన కమలేశ్ కుమారి తన ప్రాణాలను వదిరారు. ఆమె తెగింపు ధైర్యానికి గుర్తుగా కేంద్రం ఆమెకు అశోకచక్ర పురస్కారం ప్రధానం చేసింది.


