న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో త్వరలో పర్యటించనున్నారు. రక్షణ, వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల మెరుగే లక్ష్యంగా ఈ నెల 15 నుంచి 18వ తేదీల మధ్య ఈ మూడు దేశాలను చుట్టిరానున్నారు. రాజు అబ్దుల్లా ఆహ్వానం మేరకు ఈ నెల 15, 16వ తేదీల్లో జోర్డాన్‌లో పర్యటిస్తారు. అక్కణ్నుంచి, ఇథియోపియాకు చేరుకుంటారు. అనంతరం ఒమన్‌లో 17, 18వ తేదీల్లో పర్యటన జరుపుతారని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది.


