
టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే గూగుల్ గత నెలలో జెమిని యాప్‌కు 'నానో బనానా' సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్‌ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటిందని, ఈ యాప్ అధిక ప్రజాదరణ పొందిందని గూగుల్ వీపీ జోష్ వుడ్‌వార్డ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
ప్రస్తుతం నానో బననా ట్రెండ్ సాగుతోంది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. వేగం, ఖచ్చితత్వంలో ఇది చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ వంటి ప్రత్యర్థులంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ఇవి చూపరులను వావ్ అనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం నానో బననా 5 ప్రాంప్ట్‌లలో అందుబాటులో ఉంది.

ప్రాంప్ట్ 1
వినియోగదారులు తమ ఫోటోను అప్‌లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించమని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్-షెల్ఫ్ లుక్‌తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్‌లలో ఇది ఒకటి. మిమ్మల్ని మీరు యాక్షన్ ఫిగర్‌గా మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రాంప్ట్ 2
వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా మిమ్మల్ని మీరు సృష్టించుకోవచ్చు. మీ ఫోటోను 1920ల ఫ్లాపర్, 1970ల డిస్కో డాన్సర్ లేదా 1990ల సిట్‌కామ్ పాత్రలో చూపించమని అడగవచ్చు. మీరు ఎంచుకున్న దశాబ్దానికి సరిపోయే విధంగా బట్టలు, హెయిర్‌స్టైల్స్ వంటివాటిని ఏఐ మారుస్తుంది.
ప్రాంప్ట్ 3
కొంతమంది తమను తాము ప్రసిద్ద టీవీ షోలలో కనిపించేలా డిజైన్ చేసుకోవాలని ఆశపడతారు. బననా ఏఐ ఇప్పుడు దీనిని సాధ్యం చేస్తుంది. మీరు కోరుకున్నట్లు ఏఐ మిమ్మల్ని మారుస్తుంది.

ప్రాంప్ట్ 4
జెమిని ఏఐ ఇప్పుడు మిమ్మల్ని ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా చూపించగలదు. ఉదాహరణకు మోనాలిసా పక్కన నిలబడి ఉండటం, వాన్ గోహ్ స్టార్రి నైట్‌లో కనిపించడం లేదా డాలీ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీలో కలిసిపోవడం వంటివి ఉన్నాయి. మీకు నచ్చిన ప్రముఖుల పక్కన మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.
ఇదీ చదవండి: క్షీణిస్తున్న అమెరికా టూరిజం: అసలైన కారణాలు ఇవే..
ప్రాంప్ట్ 5
బననా ఏఐ సాయంతో.. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఐఫెల్ టవర్ నుంచి తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వరకు మీకు నచ్చిన ప్రసిద్ధ ప్రదేశంలో మీరు ఉన్నట్లు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. ఏఐ దీనికి లైటింగ్ ఇతర షేడ్స్ కూడా అందిస్తుంది.