
రాయిపై జంతువుల, పక్షుల చిత్రాలు నిజంగా ఒక ప్రత్యేక కళా ప్రదర్శన. నగర సౌందర్యాన్ని పెంచేందుకు, ప్రకృతిని నగర జీవనంలో కలపాలనే ఉద్దేశంతో బహిరంగ శిలలపై జీహెచ్‌ఎంసీ ఇలా చిత్రాలు వేయించింది.

ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, కళాభిమానులుకి ఎంతో ఆకర్షణగా మారాయి. - "కదలలేని శిలలపై కదిలే కళ"గా ఒక్కో చిత్రం ఒక్కో దృశ్య కావ్యంలా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఒల్డ్ ముంబై హైవే నుంచి ఖాజాగూడ రోడ్ మధ్య గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ప్రయాణించే వారు ఈ చిత్రాలను చూడొచ్చు.























