సిటీకి క్రిస్మస్ కళ వచ్చింది. నగరంలోని ప్రసిద్ధ చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి.రంగురంగుల విద్యుద్దీపాలు,శాంటాక్లాజ్‌లు,క్రిస్మస్ ట్రీ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. సికింద్రాబాద్, అబిడ్స్,బంజారాహిల్స్,నాంపల్లి,మాసాబ్‌ట్యాంక్ తదితర ఏరియాల్లోని చర్చిల్లో ప్రీ కిస్మస్,సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకొంటున్నారు.


