డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం | YSR Foundation Conduct Mega Blood Donation Camp | Sakshi
Sakshi News home page

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

Sep 15 2025 5:02 PM | Updated on Sep 15 2025 6:24 PM

YSR Foundation Conduct Mega Blood Donation Camp

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి  16వ వర్ధంతి సందర్బంగా అమెరికాలోని  డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు.  ఈ సందర్భంగా వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఫిలడెల్ఫియా నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో  మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

డాక్టర్  రాఘవ రెడ్డి గోసల సమన్వయకర్తగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో  ఆళ్ళ రామిరెడ్డి తోపాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా  ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

గత 15 సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచారు. ప్రజా శ్రేయస్సు కోసం మన వైస్సార్‌ అభిమానులు ముందుకు వచ్చి రక్త దానం చేయడం నిజంగా ప్రశంసనీయం. అదే మన రాజన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. 

అలాగే 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిని స్మరించుకుంటూ సంతాపం తెలియజేశారు. ఇక ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు.. వైఎస్సార్ అభిమానులను, సమన్వయ కర్త డాక్టర్ రాఘవ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

(చదవండి: శంకర నేత్రాలయ యూఎస్‌ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement