
శంకర నేత్రాలయ USA తన అడాప్ట్-ఎ-విలేజ్ కంటి సంరక్షణ కార్యక్రమాల దిగ్విజయాన్ని స్మరించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వెనుకబడిన గ్రామాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా ఏర్పాటు చేసేందుకు సహకరించిన పోషకదాతల అమూల్యమైన అనుభవాలు, సూచనలను తెలుకునేందుకు వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శంకర నేత్రాలయం యూఎస్‌ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందూర్తి అధ్యక్షతన ఈ సమావేశం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంతో దార్శనికులను, దాతల సముహాన్ని ఒకచోటుకి చేర్చింది. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో మెగా డోనార్లు, బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదార్లు, బోర్డు సభ్యులు ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్ తదితరలు ఉన్నారు. ఈ వేడుక గ్రామీణ భారతదేశం అంతటా జీవితాలను ప్రకాశవంతం చేసేలా అడాప్ల్ ఎ విలేజ్ పోషకదాత ఉనికిని ప్రతిధ్వనించేలా చేసింది.
ఈ సందర్భంగా దత్తత గ్రామ పోషకులు కంటి శిబిరాలను తాము సందర్శించి వివరాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. అక్కడ వారు ప్రతి రోగికి లభించిన కంటి సంరక్షణ, శస్త్రచికిత్సలు గురించి తెలుసుకున్నారు. ఒక రకంగా ఇది సంస్థ అచంచలమైన ప్రమాణాలను, లోతుగా పాతుకుపోయిన సేవతత్వాన్ని ధృవీకరిస్తోంది. చాలామంది రోగులకు దృష్టిని పునరుద్ధరించి అత్యంత దుర్భలమైన వారి జీవితాలను మార్చింది.
తరతరాలుగా కంటి సంరక్షణను ముందుకు తీసుకువెళ్లడంలో భాగస్వామ్యం, దాతృత్యంతో నడిచే నాయకత్వం శక్తిని పునరుద్ఘాటించింది. శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఎస్.వి. ఆచార్య ప్రసంగంలో, సంస్థ దార్శనిక వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ అందించిన సహాయ సహకారాలు,వి లువలు గురించి వివరించారు. అలాగే అడాప్ట్-ఎ-విలేజ్ పోషకుల ఉదార మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)