అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి | great tribute To Dr Tenneti Sudha Devi by Vanguri Foundation Samskrutika Kalasarathi Singapore | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి

Dec 16 2025 3:19 PM | Updated on Dec 16 2025 4:00 PM

great tribute To Dr Tenneti Sudha Devi by Vanguri Foundation Samskrutika Kalasarathi Singapore

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు  డా. తెన్నేటి సుధాదేవి  సంస్మరణ సభ నిర్వహించారు


నవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు‌.

సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ,  సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి,  అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement