
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..
దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు.
ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..
నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది.
దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది.
ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..)