పెళ్లిలో జరిగే ప్రతి తంతు అపురూపమైన క్షణం. ఆ వివాహ ఘట్టం అంత తేలిగ్గా మర్చిపోలేని మధురానుభూతులు. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే ఆ వధువు ఇలా చేసిందో ఏమో గానీ వరుడుకి నోట మాట లేకుండా చేసింది. అప్పుడే తనకు నచ్చినట్లుగానే అంతా చేయాల్సిందేనా అన్నట్లుగా నవ్వుతూ కళ్లప్పగించి చూశాడు.
అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన లూధియానాలోని థార్‌లో చోటుచేసుకుంది. పెళ్లి తంతు అయిపోయింది. ఆ తర్వాత అప్పగింతలు వేళ వధువుని తీసుకొచ్చి తల్లిదండ్రులు కారు వెనకాల కూర్చొబెట్టి సాగనంపుతారు కామన్. పైగా వరుడు పెళ్లికొడుకు కాబట్టి అతన కూడా కారు డ్రైవ్ చేయడు. ఇది వివాహంలో సర్వసాధారణం.
కానీ ఈమె మాత్రం తన అత్తారింటికి భర్తతో కలిసి తనే స్వయంగా కారు నడిపుతూ వెళ్లాలనకుందట. ఆ విషయం ముందే కాబోయే వరుడుకి చెప్పడంతో అతను కూడా సమ్మతించాడు. అంతేకాదు అక్కడ పెళ్లి మండపం వద్ద ఉన్న బంధువులు, సన్నిహితులు విస్తుపోయేలా నవవధువుని పెళ్లికొడుకే ఎత్తుకుని ఎస్‌యూవీ కారు వద్దకు తీసుకురాగ, ఆమె డ్రైవర్ సీటులో దర్జాగా కూర్చొంది.
ప్యాసింజర్ సీటులో వరుడు కూర్చొని మనం ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి అని ఆమెకు నవ్వుతూ చెబుతున్నాడు. అంతేగాదు వరుడు దేవుడా మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లు అని ప్రార్థించాడు కూడా. అందుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా అవుతోంది.
(చదవండి: 50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!)


