నాగాలాండ్ రాష్ట్రంలో డిసెంబర్ రాగానే తొలివారం హార్న్‌బిల్ ఫెస్టివల్ మొదలైపోతుంటుంది. ఈ వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు, విదేశీయలు తండోపతండాలు వస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగలలో ఉండే ఫుడ్ మెనూ చూస్తే నోరెళ్లబెడతారు. ఆ వంటకాలు చూసి..ఇవేం రెసిపీల్రా బాబు అని అనుకోకుండా ఉండలేదు. పాపం అలానే ఫీలయ్యాడు ఈ విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు.
నాగాలాండ్ హార్న్‌బిల్ ఫెస్టివల్ వివిధ రంగు రంగుల సంస్కృతుల సమాజాలు, సాంప్రదాయంతో శక్తిమంతంగా ఉంటాయి. నాగాలాండ్ కోహిమా నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిసామా హెరిటేజ్ విలేజ్‌లో జరిగే పది రోజుల కార్యక్రమం. ఈ పండుగ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ పండుగలో కనిపించే ప్రత్యేకమైన ఆహార వంటకాలు అత్యంత హైలెట్ అని చెప్పొచ్చు.
యూకేకి చెందిన వ్లాగర్ అలెక్స్ వాండర్స్ ఈ వేడుకలో పాల్గొని అక్కడి రెస్టారెంట్‌లోని అసాధారణ ఫుడ్ మెనూ గురించి నెట్టింట వీడియో రూపంలో షేర్ చేశాడు. ఆ వీడియోలో తాను భారతదేశంలోని హార్న్‌బిల్ ఫెస్టివల్‌లో ఉన్నానని పేర్కొన్నాడు. నా మొత్తం లైఫ్‌లో చూసి అత్యంత క్రేజీ మోనూలో ఇది ఒకటి. నాకు ఆ మెనూలో కనిపించిన 22 వంటకాలను చూసి నోటమాట రాలేదని అంటున్నాడు.
బార్బెక్యూ పోర్క్, పోర్క్ ఇన్నార్డ్స్, అనిషితో పంది మాంసం, ఆక్సోన్‌తో పంది మాంసం, బియ్యం లేదా పరాఠాతో బటర్ చికెన్, బియ్యం లేదా పరాఠాతో దాల్ మఖానీ, చికెన్ లివర్ గిజార్డ్, డ్రై రోస్ట్డ్ ఫిష్, ఫిష్ పాంగ్‌సెన్, రొయ్యల టెంపురా మరియు మరిన్ని ఉన్నాయి. వ్లాగర్ దృష్టిని ఆకర్షించినవి నత్త, పట్టు పురుగు, మిడత, సాలీడు, వెనిసన్ (జింక మాంసం), పంది మాంసం, గేమ్ బర్డ్(మాంసం), పామ్ సివెట్ పిల్లి మాంసం వంటి వంటకాలు ఉన్నాయి.
ఇలాంటివి తింటారా ఈ పండుగలో అని విస్తుపోయానంటున్నాడు యూకే వ్లాగర్. నెటిజన్లు మాత్రం మాదేశంలో విభిన్న సంస్కృతులకు నెలవు. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిదానిలో స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
హార్న్‌బిల్ ఫెస్టివల్:
హార్న్‌బిల్ ఫెస్టివల్ అనేది ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుపుకునే వార్షిక పండుగ. ఈ పండుగ నాగాలాండ్‌లోని అన్ని జాతుల సమూహాలను సూచిస్తుంది. దీన్ని పండుగల పండుగ అని కూడా పిలుస్తారు.
రంగురంగులుగా పెద్దగా ఉండే అటవీ పక్షిపేరు మీదుగా ఈ పండుగకు పేరు పెట్టారు. నాగాలాండ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, అంతర్-జాతి పరస్పర చర్యను ప్రోత్సహించడానికి, అక్కడి ప్రభుత్వం డిసెంబర్ తొలివారంలో హార్న్‌బిల్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.


