
సాక్షి,అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆక్లాండ్‌లో వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ బృందం శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ ఆనంద్ ఎద్దుల మాట్లాడుతూ జూలై 8న డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ రక్తదానంలో ఆనంద్ ఎద్దుల, బుజ్జి బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, రమేశ్ పనాటి, విజయ్ అల్ల, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సిడ్నీలో ఘనంగా జయంతి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని సిడ్నీలో శుక్రవారం ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పాలనను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న ప్రేమను గుర్తుచేసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల నిర్మాణం, ఐటీ రంగ అభివృద్ధి, 108 అంబులెన్స్‌లు, నీటి ప్రాజెక్టులు వంటి ఎన్నో పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడ్నీ కన్వీనర్ అమర్‌నాథ్ రెడ్డితో పాటు ఎన్‌ఆర్‌ఐలు రామనాథ్ రెడ్డి, రాజశేఖర్ లంకెల, మల్లికార్జున రెడ్డి, శ్రీనివాస్ బెతంశెట్టి, విష్ణువర్ధన్ రెడ్డి, పవన్ జవాజి, మను రెడ్డి, తిమ్మా రెడ్డి, రాజ్ బద్దం, చంద్ర మౌళి, పెద్దిరెడ్డి, ఉమేష్ కుర్బా, శ్రీనివాస్ గాయం, సురేశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.