అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’ | Natyanjali 2026 Celebrated Grandly In Alpharetta | Sakshi
Sakshi News home page

అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’

Mar 14 2026 11:50 AM | Updated on Mar 14 2026 11:55 AM

Natyanjali 2026 Celebrated Grandly In Alpharetta

అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.

ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.

ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్‌ సీఈఓ),  జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement