
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej)కు 38 ఏళ్లు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా దానికింకా టైముంది అని ఆ ప్రశ్నను దాటవేస్తూ ఉంటాడు. తాజాగా హైదరాబాద్‌లో ఓ సదస్సుకు హాజరైన సాయి దుర్గ తేజ్‌కు మరోసారి అదే ప్రశ్న ఎదురైంది. అందుకు సాయిదుర్గ తేజ్ స్పందిస్తూ.. నాది చాలా విషాదకరమైన స్టోరీ.. 2023లో నాకు బ్రేకప్ జరిగింది. ఇప్పటివరకు అయినవాటిలో ఇదే చాలా బాధాకరమైన బ్రేకప్. మీడియా వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది.
నా పెళ్లి నేనే ప్రకటిస్తా
సినిమా హిట్టయింది, నెక్స్ పెళ్లే.. ఆ అమ్మాయితో వెడ్డింగ్, ఈ అమ్మాయితో వెడ్డింగ్ అంటూ నానా రకాల పుకార్లు సృష్టించారు. దానివల్లే మా ప్రేమ విఫలమైంది. ఆమె నా కాలేజీ గర్ల్‌ఫ్రెండ్.. తను ఆ పుకార్లు చూసి తట్టుకోలేకపోయింది. ఎక్కువగా ఆందోళన చెందింది. దాంతో బ్రేకప్ జరిగిపోయింది. కాస్త మీ అందరూ కాస్త సైలెంట్‌గా ఉంటే నా పెళ్లి వార్త నేనే ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చాడు.
పిల్లలకు సమయం కేటాయించాలి
ఇంకా మాట్లాడుతూ.. ఇప్పుడు పిల్లలతో పేరెంట్స్ ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. చాట్ జీపీటీ, ఏఐ అంటున్నారు. నాకు మాత్రం మా అమ్మే నా ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు.. ఇలా వీళ్లతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. పిల్లలకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. నేను నా సెకండ్ క్లాస్ లవ్‌స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని ఆమె ఇచ్చారు. ఇకపోతే తెలంగాణలో కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నాను. వారి చదువు, పోషణ అన్నీ చూసుకుంటాను అని చెప్పుకొచ్చాడు.
అప్పట్లోనూ ఓ బ్రేకప్ స్టోరీ
కాగా 2023లో విరూపాక్ష సినిమా రిలీజ్ సమయంలోనూ తన పర్సనల్ లైఫ్ గరించి మాట్లాడాడు తేజ్. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పాడు. అప్పటినుంచి అమ్మాయిలంటేనే భయమేస్తుందన్నాడు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ తన తల్లి పేరు వచ్చేలా తప నేమ్‌ను సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నాడు.
చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?