
వయసు పెరిగే కొద్ది శారీరక మార్పులు కారణంగా పిగ్మెంటేషన్ వేధిస్తుంటుంది. ముఖం మంతా నల్లటి మచ్చలతో ముఖం కళ తప్పినట్లుగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో లభించే వాటితోనే సులభంగా చెక్‌పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా..!.
ఒక బంగాళ దుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. ఈ మాస్క్ ని పిగ్మెంటేషన్ బాగా ఉన్న ప్రదేశాలలో అప్లై చేసి అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయండి. ఇలా నెల రోజుల పాటు రోజుకి రెండుసార్లు చేయవచ్చు.
నిమ్మరసం, తేనె..
రెండు టేబుల్ స్పూన్ల తేనెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి కలపండి. అవసరమున్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒక సారి మీకు ఫలితం కనిపించే వరకూ చేయవచ్చు.
టేబుల్‌స్పూన్ చొప్పున సోయా పాలు, నిమ్మరసం, టొమాటో గుజ్జు తీసుకొని ఈ మూడింటినీ మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసి పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆరాక కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.
టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, కలబంద గుజ్జు తీసుకొని అందులో రెండు టేబుల్‌స్పూన్ల బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్‌లాగా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్‌పై రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు అక్కడ చర్మంపై ఏర్పడిన మృతకణాలు సైతం తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుందట.