వాల్‌నట్స్‌ షెల్స్‌తో వైట్‌ హెయిర్‌కి చెక్‌పెడదాం ఇలా..! | Beauty Tips: How to Remove Gray Hair with Walnuts | Sakshi
Sakshi News home page

వాల్‌నట్స్‌ షెల్స్‌తో వైట్‌ హెయిర్‌కి చెక్‌పెడదాం ఇలా..!

Jun 27 2025 6:04 PM | Updated on Jun 27 2025 6:40 PM

Beauty Tips: How to Remove Gray Hair with Walnuts

జుట్టు నెరవడం దగ్గర నుంచి, కాలిన గాయాలకు మన వంటింట్లో ఉపయోగించే వాటితోనే సులభంగా పరిష్కారం చూపొచ్చట. సహజసిద్ధమైన వాటితో మెరుగైన ఫలితమే గాక ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సమస్యలకు కిచెన్‌ టిప్స్‌ ఏంటో చూసేద్దామా..!. 

వాల్‌నట్స్‌ లోపల ఉన్న పప్పుని తీసుకుని షెల్స్‌ని పడేస్తుంటారు. కానీ వాల్‌నట్స్‌ షెల్స్‌ తెల్లజుట్టుని నల్లగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వాల్‌నట్స్‌ షెల్స్‌ను మెత్తగా పొడిచేసుకోవాలి. ఆరు టేబుల్‌ స్పూన్ల పొడిని లీటరు నీటిలో వేసి అరగంటపాటు మరిగించాలి. 

మరిగిన నీటిని చల్లారాక వడగట్టాలి. ఈ నీటిని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టి మర్దన చేయాలి. రెండు గంటల తరువాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల మూడు నెలల్లో తెల్లజుట్టు నల్లగా... ఒత్తుగా మారుతుంది.

నాలుక కాలినప్పుడు చల్లని పదార్థాలు తినడం తెలిసిందే. అయితే ఐస్‌క్రీమ్‌ను కొద్దికొద్దిగా చప్పరించడం వల్ల కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీనికోసం వెనిలా, మ్యాంగో, పిస్తా, గుల్‌ఖండ్‌ ఫ్లేవర్స్‌ ఉన్న  ఐస్‌క్రీమ్‌లు బాగా పనిచేస్తాయి.

పుదీనా ఆకుల్లో కొద్దిగా తేనె వేసి కచ్చపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా చప్పరిస్తుంటే కాలిన నాలుకకు ఉపశమనం లభిస్తుంది. 

(చదవండి: Today Tip : షుగర్‌ పేషెంట్లు ఎగ్స్‌ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?)

Advertisement
 
Advertisement
Advertisement