ఐదు పదుల వయసులోనూ అంతే గ్లామర్‌గా ఖుష్బూ సుందర్‌..! | Beauty Tips: Khushbu Sundar revealed the secret behind her glowing skin | Sakshi
Sakshi News home page

ఐదు పదుల వయసులోనూ అంతే గ్లామర్‌గా ఖుష్బూ సుందర్‌..! బ్యూటీ సీక్రెట్‌ ఇదే..

Oct 11 2026 12:35 PM | Updated on Oct 11 2026 12:35 PM

Beauty Tips: Khushbu Sundar revealed the secret behind her glowing skin

తమిళ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్‌ ఐదు పదుల వయసులో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని గ్లామర్‌ ఆమె సొంతం. ఈ వయసులో కూడా అంతే అందంగా, ముగ్ధమనోహరంగా ఉంటారామె. చూడ చక్కని చందమామలా మెరుస్తూ ఉంటుంది ఆమె చర్మం. దాని వెనుక దాగున్న సీక్రెట్‌ని ఖుష్బూనే స్వయంగా వెల్లడించారు. ఆమె కూడా వంటింటి చిట్కాలనే ఇష్టపడతానని అన్నారు. మరి అవేంటో చూద్దామా..!

ఖుష్బూ సుందర్‌ పచ్చిపాలు, కుంకుమపువ్వు, బాదం నూనె తన సౌందర్యంలో భాగం అని అంటోంది. ఆమె ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్యలో నిద్రలేస్తానని చెప్పారు. ఉదయం పూట ఇంట్లో అందరికీ టీ పెట్టి ఆ సమయంలో పచ్చిపాలను ముఖానికి రాసుకుంటానని అన్నారు. కొన్నిసార్లు కుంకుమపువ్వు రేకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ముఖానికి ఆప్లై చేస్తానని అన్నారు. 

మరికొన్నిసార్లు నూనె లేదా బాదం నూనెతో ముఖానికి మసాజ్‌ చేసుకుంటానని అన్నారు. దాదాపు ప్రతి రోజు ఒక అరగంటపాటు ఇలానే చేస్తానని చెప్పారు. అలాగే తనకు ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకుంటానని చెప్పారు. కేవలం తినాలనే ఉద్దేశ్యంతోనో లేక ఆనందం కోసమో తినడం వల్ల ఆహారంతో అనారోగ్యకరమైన సంబంధం ఏర్పడుతుందన్నారామె.  

ఇదీ చదవండి: ఆ తల్లి.. రియల్‌ వారియర్‌! కంటతడి పెట్టించే దృశ్యం..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement