ఒక్కోసారి సాధారణ క్షణంగా మొదలైన వైరల్ వీడియో..తర్వాత ఊహించని విధంగా ఎందరో మనసుల్ని కదిలిస్తుంది. బహుశా వాళ్లకు కూడా తెలియదేమో తమ కథ ఇంతమంది హృదయల్ని కదిలిస్తుందని. ఇదంతా ఎందుకంటే ఓ ఒంటిరి తల్లి పోరాటం నెట్టింట ఎంత సంచలనంగా మారి ఎందరి నెటిజన్ల మనసుని దోచుకుందో తెలిస్తే విస్తుపోతారు. దయకు ఇంకా చోటు ఉందననిపిస్తుంది.
అసలేం జరిగిందంటే..లడఖ్‌లోని ఒక పెట్రోల్ బంక్‌లో ఒక మహిళ తన చిన్న బిడ్డను వీపుకి కట్టుకుని పనిచేస్తుంటుంది. అక్కడకు తన భర్తతో వచ్చిన మరో మహిళ దీన్ని రికార్డు చేసి నెట్టింట షేర్ చేయడంతో ఆ దృశ్యం వైరల్‌గా మారింది. ఆ వీడియోకి "నా జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను ఇక్కడే చూడగలరు" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసిందా యూజర్.
అత్యంత సర్వసాధరణమైన దృశ్యమే అయినా వీక్షకులను ఎందుకనో బాగా ఆకట్టుకుంది. పనిచేస్తూనే బిడ్డను చూసుకుంటుందంటే ఎంత కష్టంలో ఉందో అర్థమవుతుందంటూ నెటిజన్లు స్పందించడమే కాదు..ఆమెకు తమవంతుగా సాయం చేస్తామంటూ..ఆ వీడియోని పోస్ట్ చేసిన మహిళను సంప్రదించారట కూడా. అసలు వీడియోలో కనిపిస్తున్న తల్లికి కూడా తెలియదు తన పట్ల ఇంతమంది ఆదరాభిమానాలు చూపిస్తారని, నిజంగా మన సమాజంలో దయ ఇంకా బతికే ఉంది అంటూ భావోద్వేగంగా సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.
అంతేగాదు మరికొందరు ఆమె కోసం కొంత సొమ్ము కలెక్ట్ చేశామని ఆమె బిడ్డ భవిష్యత్తుగా వినియోగించాల్సింది కోరారని కూడా చెప్పారు. అంతేగాదు ఆ వీడియోని షేర్ చేసిన సదరు మహిళ ఆ ఒంటిరి తల్లికి నెటిజన్ల అభినందనలు, ఆకాంక్షలను కూడా తెలియజేయడం విశేషం. అందుకు ప్రతిగా ఆతల్లి వాళ్లందరికి కృతజ్ఞతలు తెలిపింది కూడా. కాగా, నెటిజన్లంత ఆమెను ఆధునిక ఝాన్సీ లక్ష్మీబాయి అని కీర్తిస్తుండటం విశేషం.
< ఇదీ చదవండి: శాకాహరం అందించే కేఎఫ్‌సీ గురించి తెలుసా..!


