కూమార్తె పెళ్లిలో సెన్సెషన్‌గా 41 ఏళ్ల తండ్రి..! కాబోయే అల్లుడు సైతం.. | 41 year old Chinese dad goes viral for youthful He follows 3 main habits | Sakshi
Sakshi News home page

కూమార్తె పెళ్లిలో సెన్సెషన్‌గా 41 ఏళ్ల తండ్రి..! కాబోయే అల్లుడు సైతం..

Oct 22 2026 3:49 PM | Updated on Oct 22 2026 3:55 PM

41 year old Chinese dad goes viral for youthful He follows 3 main habits

కుమార్తె పెళ్లిలో వధువు లేదా వరుడు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఉంటారు. కానీ ఇక్కడ వధువు తండ్రే సెన్సెషన్‌గా మారాడు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా కొత్త జంట గురించి కాకుండా అందరూ ఆ నాన్న గురించి మాట్లాడుకుంటున్నారు. అతడు నిజంగా తండ్రేనా అంటూ ఒకటే గుసగుసలు. పాపం ఆ అమ్మాయి భర్త సైతం మామాగారిని చూసి షాక్‌ అయ్యాడు. 

అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. 41 ఏళ్ల జెంగ్‌ అనే తండ్రి తన 21 ఏళ్ల కూతురు పెళ్లిలో సెంటర్‌ ఆప్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అందరూ అతడి గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవడంతో రాత్రికి రాత్రే సెన్సెషన్‌ స్టార్‌గా మారిపోయాడు. ఎందుకంటే అతడు తన కూతురు పక్కన నిలబడగానే అందరూ అతడిని అన్నయ్యేమో అనుకున్నారు. 

అతడు వధువు తండ్రిని అని తెలుసుకుని ఒక్కసారిగా విస్తుపోయారు. ఆఖరికి కాబోయే అల్లుడు సైతం మామగారి గ్లామర్‌కి ఫిదా అయిపోయాడు. అయితే జెంగ్‌ మాత్రం ఇది తనకు అలవాటైపోయిందని తేలిగ్గా కొట్టిపారేశాడు. అంతేగాదు తన కూతురితో బయటకు వెళ్తే చాలాసార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చాడు. కొందరేమో తనను అన్నయ్య అనుకునేవారని, మరికొందరు బాయ్‌ఫ్రెండ్‌ అని పొరపడిన సందర్భాలు ఉన్నాయని అంటున్నాడు. తనకిదంతే మాములే అని తేలిగ్గా అనేస్తున్నాడు జెంగ్‌. నిజానికి అతడు చూస్తే 41 ఏళ్ల వ్యక్తి అని మాత్రం అనుకోరు. 20 ఏళ్ల కుర్రాడిలా ఉన్న అతడి ఆహార్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

అతడి యంగ్‌ లుక్‌ సీక్రెట్‌ ఏంటంటే..
మరి ఇంతలా యంగ్‌ లుక్‌లో ఎలా కనిపిస్తున్నారని జెంగ్‌ని అడిగితే..చాలామంది తను  కఠిన వ్యాయామాలు చేస్తుంటానని, ఏదో ప్రత్యేకమైన ఆహారం లాగించేస్తానని, ఏవేవో చర్మ సంరక్షణ పద్ధతు పాటిస్తున్నాని అనుకుంటారు. కానీ తను అవేమి పాటించనని అన్నారు. ఆయన చాలా సింపుల్‌గా ఆ మూడు అలవాట్ల వల్లే ఇలా కనిపిస్తున్నానని అన్నారు. వేళకు నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ‍ప్రశాంతంగా ఉండటం. ఇవే తన యంగ్‌ లుక్‌ సీక్రెట్‌ అని నవ్వుతూ చెబుతున్నాడు జెంగ్‌. 

ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే రోజూ సుమారు పది నుంచి 12 గంటలు హాయిగా నిద్రపోతానన్నారు. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు బ్యాడ్మింటన్‌  తప్పకుండా ఆడతానని అన్నారు.

ఇక్కడ జెంగ్‌ చెప్పే మూడు అలవాట్లు ఆరోగ్యకరమైన జీవన విధానానికి అత్యంత ముఖ్యమైనవి. అలాగే ఆరోగ్య నిపుణులు సైతం హెల్దీ లైఫ్‌ కోసం నొక్కి చెప్పేవే. అయితే యంగ్‌ లుక్‌లో కనిపించడం మాత్రం తీసుకునే ఆహారం, ఆయా వాతావరణం, శారీర పరిస్థితులు తదితర అంశాలన్ని ముడిపడి ఉంటాయని చెబుతున్నారు.

 

ఇదీ చదవండి: కేరళ గ్రామం నుంచి లాస్ ఏంజిల్స్‌ వరకు..! ఎవరీ రవ్లీన్ వర్గీస్?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement