ద్రౌపదీ ముర్ము శబరిమల పర్యటన.. గుంతలో ఇరుక్కున్న రాష్ట్రపతి హెలికాప్టర్‌ | President Droupudi Murmu visit Sabarimala Ayyappa Temple Updates | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శబరిమల పర్యటన అప్‌డేట్స్‌..

Oct 22 2025 8:50 AM | Updated on Oct 22 2025 9:52 AM

President Droupudi Murmu visit Sabarimala Ayyappa Temple Updates

President Droupudi Murmu Sabarimala Visit Updates..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్‌కు సమస్య

  • కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు సమస్య తలెత్తింది. 
  • ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్‌ తర్వాత ఓ వైపు కూరుకుపోయిన హెలికాప్టర్‌
  • గుంతలో ఇరుక్కుపోవడంతో అక్కడే ఆగిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌
  • దానిని నెట్టేందుకు పోలీస్‌, అగ్నిమాపకశాఖ ప్రయత్నం.
     

👉రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్‌భవన్‌ నుంచి శబరిమలకు బయలుదేరారు. 

👉రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తిరువనంతపురం చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో తిరువనంతపురంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. రాజ్‌భవన్‌కు ఆమె వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేశారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటారు.

👉ఇక, ఉదయం హెలికాప్టర్‌లో నీలక్కల్ చేరుకుని, రోడ్డు మార్గంలో పంపకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గూర్ఖా వాహనంలో(ప్రత్యేక ఫోర్‌ వీలర్‌ వాహనం) సన్నిధానం చేరుకుంటారు. శబరిమల సందర్శించిన తర్వాత సాయంత్రం తిరువనంతపురం తిరిగి వస్తారు. ఈ క్రమంలో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు ఏర్పాటు చేశారు.

👉రేపు ఉదయం 10.30 గంటలకు రాజ్ భవన్‌లో మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, మధ్యాహ్నం 12.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా శివగిరి చేరుకుని, శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు పాలలోని సెయింట్ థామస్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు వేడుకను ప్రారంభిస్తారు. 24న సాయంత్రం 4.15 గంటలకు కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాలలో జరిగే శతాబ్ది ఉత్సవాల కోసం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement