
పువ్వులాంటి కోమలమైన అందం కోసం పడుతులు ఎంతగానో తపిస్తుంటారు. ఎన్నో క్రీమ్‌లు, లోషన్లు తెగ విచ్చలవిడిగా రాసేస్తుంటారు. అయినా మంచి ఫలితం ఉండక బాధపడుతుంటారు. అలాంటి వారు తప్పక ఈ ఔషధగుణాలున్న ఈ ఐదు పువ్వులను తప్పక ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ పువ్వులేంటో సవివరంగా తెలుసుకుందామా..!.
చమోమిలే పువ్వులు
చమోమిలే పువ్వులు వడదెబ్బకు కమిలిన చర్మాన్ని అందంగా మార్చుతుంది. ఎర్రబడిన చర్మాన్ని నార్మల్ స్థితికి తీసుకువస్తుంది. అలాగే చర్మం రంగుని కూడా కాంతిమంతంగా మారుస్తుంది. హానికరమైన యూవీ కిరణాలకు గురయ్యి..సన్‌బర్న్ తరుచుగా ఎదురవ్వుతుంది చాలామందికి.
అలాంటి వారికి తాజా చమోమిలే టీ చక్కటి ఉపశమనం. అంతేగాదు చిన్న కాటన్ ప్యాడ్, లేదా టవల్‌ని ఆ లిక్విడ్‌లో ముంచి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
విచ్ హాజెల్
విచ్ హాజెల్ పువ్వులను తోటలో సులభంగా పెంచవచ్చు, ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పువ్వులు మొటిమలతో పోరాడటమే కాకుండా సహజ ఆస్ట్రింజెంట్‌గా కూడా పనిచేస్తాయి. ఇది చర్మ కణాలు, రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. జిడ్డుని తొలగించి, మొటిమల సమస్యను నివారిస్తుంది.
కలేన్ద్యులా
"గెండే కా ఫూల్" అని కూడా పిలిచే అద్భుతమైన వైద్యం. ఇది యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను, జుట్టుపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌ని తొలగించి శుభ్రంగా ఉంచుతుంది.
అనేక సౌందర్య సాధనాల్లో ఈ కలేన్ద్యులా పువ్వుని ఉపయోగిస్తారు. నల్లమచ్చలు, ఎరుపుని తగ్గించి, మృదువైన ఆకృతిని అందిస్తుంది.
మందార
పెద్ద పెద్ద ఎర్రటి మందార పువ్వులు చర్మం, జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. మందారలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంధోసైనోసైడ్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, రాడికల్ నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. మందారలోని అధిక ఆస్ట్రిజెంట్ లక్షణం అధిక నూనె స్రావాన్ని నియంత్రించి, రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.
జాస్మిన్
చర్మంపై ఉండే వాపు, ఎరురంగు, చికాకుని నివారిస్తుంది. మొటిమల తాలుకు మచ్చలను కూడా తొలగిస్తుంది. యాంటీఏజింగ్ ప్రయోజనాలను కలిగి ఉంది. అలాగే యూవీ కిరణాలను, కాలుష్యం వంటి సమస్యల నుంచి రక్షించచేలా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది అకాల వృద్ధాప్య సమస్యను నివారస్తుంది. జాస్మిన్ క్రీమ్ లేదా నూనె అనేక నొప్పులను, తిమ్మిరుల నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది.
అలాగే ముఖంపై ఉండే గాయలు, కోతలకు చక్కటి క్రిమిసంహార మందులా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చివరగా సహజసిద్ధమైన అందం కోసం రోజూ చూసే ఈ ఐదు మొక్కలతో అందాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు. పైగా ఇవి సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.
(చదవండి: A2 నెయ్యి' అంటే..? దీనికి మాములు నెయ్యికి తేడా ఏంటంటే..)