
నెయ్యి తినడం మంచిదని విన్నాం. ఇటీవలకాలంలో పోషకాహార స్పృహ ఎక్కువై..మంచి విటమిన్లుతో కూడిన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదో తిన్నామంటే తినడం కాకుండా..ఆరోగ్యదాయకమైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ఒకటే ఈ 'ఏ2 నెయ్యి' . దీన్ని ఆధునిక సూపర్ ఫుడ్‌గా కీర్తిస్తున్నారు. అంతేగాదు ఆయుర్వేద గ్రంథాల్లో సైతం దీన్ని "లిక్విడ్ గోల్డ్"గా వ్యవహరిస్తున్నారు. అసలేంటీ నెయ్యి..? మాములు నెయ్యికి దీనికి ఉన్న తేడా ఏంటంటే..
ఏ2 నెయ్యి అంటే..
గిర్, సాహివాల్ మరియు రతి వంటి స్వదేశీ భారతీయ ఆవుల పాల నుంచి తీసిన నెయ్యిని ఏ2 నెయ్యిగా వ్యవహరిస్తారు. దీన్ని తీసే విధానంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుందట. ఎందుకంటే మాములు వాటిలో పచ్చి పాల నుంచే నేరుగా నెయ్యిని సెపరేట్ చేయరు. పెరుగుగా తోడుపెట్టి పులిసిన మజ్జిగ నుంచే వెన్నను సెపరేట్ చేసి చక్కగా కాస్తారు. ఇది చూడటానికి గోల్డెన్ రంగులో సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట.
ఇందులో బీటా కేసిన్ ప్రోటీన్ మాత్రమే ఉంటుందట. అదే సాధారణ వాణిజ్య పాల్లో ఏ1 బీటా కేసిన్ ఉంటుందట. అంతేగాదు ఈ ఏ2 పాలు టైప్ 1 డయాబెటిస్, కరోనరి హార్ట్ డిసీటజ్ ఆర్టెరియోస్క్లెరోసిస్ ఆటిజం, స్కిజోఫెనియా వంటి శిశు ఆకస్మిక మరణాలను నివారించగలదట. ఈ ఏ2 నెయ్యిని 5 వేల ఏళ్లనాటి పురాతన పద్ధుతుల్లో చేయడం వల్లే ఇన్ని విటమిన్స్ , పోషకాలు సమృద్ధిగా ఉంటాయిట.
ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..
ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డీ, కాల్షియం, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ కే, ఒమేగా 3, ఒమేగా 9 తదితర కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవేగాక మెదడు పనితీరుని మెరుగుపరిచే సంయోగ లినోలిక్ ఆమ్లం (CLA) వంటివి ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అథ్లెట్లు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సులభంగా జీర్ణమయ్యే సామర్థ్యం పెరుగుతుంది కూడా. అలాగే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చి, జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుంది. పాలు, పన్నీర్ వంటివి పడవని వారికి ఈ ఏ2 నెయ్యి మంచి సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
చర్మం, జుట్టు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నివారిస్తుందా..
ఈ ఏ2 నెయ్యి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. సహజమైన మెరుపుని అందిస్తుంది. అలాగే జుట్టు ఆకృతిని మెరుగుపరిచి, జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఉంటుందట.
అలాగని మితీమిరీ వినయోగించొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎప్పుడు సమతుల్యతకు పెద్దపీట వేస్తే..ఏదైనా ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నారు.
(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్‌కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..)