తప్పు తాను చేసి.. నిందలు , స్కామ్‌లు! | Former CM YS Jagan lashes out at Chandrababu conspiracies | Sakshi
Sakshi News home page

తప్పు తాను చేసి.. నిందలు , స్కామ్‌లు!

Mar 12 2026 5:18 AM | Updated on Mar 12 2026 5:18 AM

Former CM YS Jagan lashes out at Chandrababu conspiracies

చంద్రబాబు కుట్రలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపాటు

బాబు తన హయాంలో టీటీడీ నెయ్యిలో కల్తీ జరిగితే.. మాపై నింద మోపారు

కిలో నెయ్యి రేటును ఏడాదిలో రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు 

నెయ్యి కొనుగోలులో రూ.200 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు.. 

వీటిపై శాసనమండలిలో మా ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే బాబు సమాధానం చెప్పలేదు 

ఇందాపూర్, హెరిటేజ్‌కి సంబంధం ఏమిటంటే నోరు మెదపరు.. 

టీటీడీ పరకామణిలో రూ.కోటి బంగారం దొంగతనం చేస్తే ఆ కేసును దాచిపెట్టారు 

చంద్రబాబు హయాంలో ఇంతటి ఘోరమైన తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్‌ ఇప్పించి కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నారు

సాక్షి, అమరావతి: ‘ఒకవైపు చంద్రబాబే తప్పు చేసి.. వేలెత్తి ఎదు­టివారిపై నింద వేసేస్తారు. రెండోవైపున ఆ దుమారంలో­నే స్కామ్‌లు చేస్తారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను కిలో­కి రూ.351 నుంచి రూ.716కు పెంచేసి.. హెరిటేజ్‌ మాన్యు­ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఇందాపుర్‌ డెయిరీ నుంచి సరఫరా చే­శా­రు. రూ.200 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు..’ అని వైఎస్సార్‌­సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయి­లో ధ్వజమెత్తారు. 

‘‘ఇలాంటి వాళ్లను ఏమనాలి? రెండున్నర గంటల సినిమాలో విలన్‌ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్‌లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే..!’ అంటూ చంద్ర­­­బాబును తూర్పా­ర­బట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. 

ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్‌
తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి వ్యవహారంలో మా పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్ర­బాబు సమాధానం కూడా చెప్పలేదు. ఇందాపూర్‌ డెయిరీ, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌కు మధ్య బంధంపై నోరు ఎత్తలేదు. సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపరు. ఇక్కడ నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూనే మరోవైపు నెయ్యిలో స్కామ్‌లకు పాల్పడుతున్నారు. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్‌ బయటపడుతుంది. 

ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. 2024 ఆగస్టులో కిలో నెయ్యి రూ.351కి టీటీడీకి సరఫరా జరిగితే అక్టోబర్‌ 2025 నాటికి.. కేవలం ఏడాదిలోనే రూ.716కు పెంచేశారు. ఏడాదిలో కేజీ నెయ్యి ధరను రూ.365 చొప్పున పెంచేసి దోపిడీకి పథకం వేశా­రు. నెయ్యి స్కామ్‌ కోసం చంద్ర­బాబు అండ్‌ కో దోపిడీ మందలా (కాటెల్‌) ఏర్పడి దేవుడి సొమ్మును కొల్లగొడుతున్నారు. 

చంద్ర­­బాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు రూ.351కే కిలో నెయ్యి టీటీడీకి సరఫరా అయితే.. ఆ తర్వాత 2025 జనవరి 31 నాటికి అమాంతం రూ.513కి ఎగబాకింది. 2025 అక్టోబర్‌ నాటికి రూ.599 దూసుకెళ్లి.. అదే నెలలో రూ.716­కి చేరుకుంది. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్‌. దేవు­డంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దు­మా­రం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్‌లు చేస్తున్నారు. 

ఇదీ చంద్రబాబు కుట్ర..! 
తిరుమల హుండీలో డబ్బులు లెక్కించే పరకామణి నుంచి 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం దొంగతనంపై కేసు నమోదైంది. చంద్ర­బాబు హయాంలో ఇంతటి ఘోరమైన తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్‌ ఇప్పించారు. పైగా మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా హయాంలో రూ.75 వేల విలువైన డాలర్‌ నోట్లు దొంగతనం జరిగితే.. ఏకంగా రూ.15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ దేవాలయానికి రాయించారు. దేవుడి సొమ్ముతో ఎవరైనా చెలగాటం ఆడితే అది తప్పని, క్రమశిక్షణ ఉండాలంటూ అప్పటి టీటీడీ బోర్డు ఆ నిర్ణయం తీసుకుంది. 

చంద్ర­బాబు హయాంలో టీటీడీ పరకామణి లెక్కింపుల సమయంలో 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం చోరీ జరిగింది. ఈ ఘటనను బయటకు రానివ్వకుండా దాచిపెట్టారు. మరోవైపున 2025 సెపె్టంబర్‌లో చంద్రబాబు కుట్ర పూరితంగా.. ఎప్పుడో 2023­లో పరకామణిలో రూ.75­వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసి.. పశ్చాత్తాపంతో రూ.15 కోట్లు దేవుడికి రాసిచ్చిన ఘటనను తప్పుపడుతూ దు్రష్పచారం చేశారు. కానీ, చంద్రబాబు ఆరోపణ కంటే ముందు, ఆయన హయాంలో నమోదైన చోరీని మాత్రం కావాలనే బయటకు రాకుండా కప్పెట్టేశారు.  

నెయ్యి రేట్లు అమాంతం పెంచేసి.. 
చంద్రబాబు నెయ్యి వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా ఆరోపణలు చేశారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మే 15న నెయ్యి టెండర్లు ఖరారయ్యాయి. జూన్‌ 4న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. జూన్‌ 12న నెయ్యి సరఫరా ప్రారంభమైంది. వాటిల్లో జూన్‌–జూలైలో 4 నెయ్యి ట్యాంకులు టీటీడీ టెస్టులు పాసయ్యాయి. అదే జూలై 6, 8వ తేదీల్లో వ చ్చిన మరో 4 ట్యాంకుల టెస్టులు టీటీడీ ల్యాబ్‌లో నెగిటివ్‌ వ చ్చింది. మళ్లీ చంద్రబాబు హయాంలోనే ఆ నాలుగు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు ఆగస్టు, సెపె్టంబర్‌లో వేరే కంపెనీ పేరుతో మళ్లీ టీటీడీలోకి వచ్చాయి. 

వాటిని టీటీడీ అనుమతించింది. వాటిని లడ్డూల తయారీలో ఉప­యోగించారు. ఇదంతా దాచిపెట్టిన చంద్రబాబు.. కుట్ర పూరితంగా సెపె్టంబర్‌ 18న తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఎదురు ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే మాపై నెట్టేశారు. అసలు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు వెనక్కి రాకూడదు. అలాంటి వాటిని వెనక్కి రప్పించి వినియోగించారు. ఇక్కడ వైష్ణవి డెయిరీ, సంగం డెయిరీ సంబంధాలు అందరికీ తెలు­స్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు తప్పు చేసి వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. 

రెండో వైపున దుమారంలోనే స్కామ్‌లు చేస్తారు. హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లో తమ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఇందాపూర్‌ అని రాసుకున్నారు. అదే క్రమంలో హెరిటేజ్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ను వాళ్లే ఫైర్‌ చేస్తారు. ఏడాదిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కి పెంచేసి స్కాము­లు చేసుకుంటారు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? సినిమాలో రెండున్నర గంటల విలన్‌ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్‌లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే!

శ్రీవారి సొమ్ము.. అయినవారికి దోచిపెట్టేందుకు..

బాబును సీఎంగానే భరించలేకపోతున్నారు
ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు?.. వైఎస్‌ జగన్‌ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియా ప్రచురించిన, ప్రసా­రం చేస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు బుధవారం అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ‘చంద్రబాబును ముఖ్యమంత్రిగానే రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు..?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

వైఎస్సార్‌సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1,100 మందిలా మాట్లాడుతున్నారంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన మరో ప్రశ్నకు జగన్‌ స్పందిస్తూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలు అంత నిబద్ధతతో ఉన్నారు. బలంగా పని చేస్తున్నారు. అది మంచి విషయమే’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement